హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మునుగోడు ఉపఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఘనకేతనం ఎగురవేసింది. నాలుగో రౌండ్ నుంచే ఆధిక్యం ప్రదర్శించిన తెరాస చివరి వరకు ఆధిక్యం నిలబెట్టుకుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఏకంగా డిపాజిట్నే కోల్పోయింది.
మునుగోడు ఉపఎన్నికలో అధికార పక్షం ముందంజలో కొనసాగుతోంది. దీనితో గెలుపు ఖాయమని ఫిక్స్ అయిన తెరాస పార్టీ శ్రేణులు తెలంగాణ భవన్లో బాణసంచా కాల్చి సంబురాలు చేసుకున్నాయి.