విజయవాడ : సీనియర్ రాజకీయ నాయకుడు కొణతాల రామకృష్ణ బుధవారం జనసేనాని పవన్ కల్యాణ్ తో సమావేశమయ్యారు. పవన్ కల్యాణ్ తో పలు అంశాలపై చర్చించిన కొణతాల త్వరలో జనసేనలో చేరేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. వైసీపీ వ్యవస్థాపక సభ్యుల్లో కొణతాల రామకృష్ణ కూడా ఒకరు. అయితే, చాలాకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆయన హైదరాబాదులో పవన్ కల్యాణ్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ తో భేటీలో ప్రధానంగా ఉత్తరాంధ్ర సమస్యలనే ఆయన ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి బరిలో దిగాలని కొణతాల భావిస్తున్నట్టు సమాచారం. ఇవాళ పవన్ కల్యాణ్ తోనూ ఇదే అంశంపై చర్చించినట్టు తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఈ నెలలోనే జనసేనలో చేరే అవకాశం ఉంది.