న్యూఢిల్లీ : ఏపీకి కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల పంట పడింది. స్వచ్ఛ సర్వేక్షణ్-2023లో ఏపీ నాలుగు జాతీయ అవార్డులు, ఒక రాష్ట్ర స్థాయి అవార్డు గెలుచుకుంది. దక్షిణ భారత దేశంలో క్లీన్ సిటీల్లో ఏపీ నంబర్ వన్‌గా నిలిచింది. జాతీయ స్థాయిలో గుంటూరు ఆలిండియా రెండో ర్యాంకు, గ్రేటర్ విశాఖపట్నం ఆలిండియా 4వ ర్యాంక్, విజయవాడ ఆలిండియా 6వ ర్యాంక్, తిరుపతి ఆలిండియా 8వ ర్యాంకు సాధించాయి. అత్యంత పరిశుభ్రంగా నగరాలను తీర్చిదిద్దినందుకుగానూ ఏపీ ఈ అవార్డులను దక్కించుకుంది. పట్టణాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తోన్న కృషికి ఈ అవార్డులు ఈ అవార్డులు చిహ్నమని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. క్లీన్ ఏపీ (క్లాప్) ప్రోగ్రాం విజయవంతమైందన్నారు. పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించామని, వారంతా తిరిగి విధుల్లో చేరారన్నారు. సమ్మె వల్ల కొంత ఇబ్బంది కలిగిందని, ఇప్పుడు ఆ సమస్య పరిష్కారం జరిగిందని మంత్రి ఆదిమూలపు అన్నారు. 2022లో కూడా జాతీయ స్థాయిలో అత్యుత్తమ పారిశుధ్య కార్మిక విధానాలు పాటిస్తున్నందుకు తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్‌కు ‘సఫాయిమిత్ర సురక్షా సెహెర్’ అవార్డు దక్కింది. సీఎం జగన్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు మంచి ఫలితాలు ఇచ్చాయనడానికి ఆంధ్రప్రదేశ్‌కు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు రావడమే నిదర్శనం.