ఎన్టీఆర్ బ్యూరో : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి ఎవరనే చర్చకు ముగింపు పలికారు. నిన్న మొన్నటివరకు ఎంపీ అభ్యర్థిగా పలు పేర్లను అధిష్టానం పరిశీలించింది. ఈ క్రమంలో మంత్రి జోగి రమేష్ పేరుతో పాటు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పేరుని కూడా పరిశీలించింది. ఒకానొక దశలో ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ పేరును కూడా పరిగణాలకు తీసుకున్న అధిష్టానం అభ్యర్థిని ప్రకటించేందుకు మాత్రం నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చింది. తాజాగా గురువారం రాత్రి ప్రకటించిన మలి విడత అభ్యర్థుల జాబితాలో కేశినేని నానికి విజయవాడ పార్లమెంటు టికెట్ కేటాయిస్తున్నట్లు అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇటీవలే వైసిపి లోకి వెళ్తున్నానని ప్రకటించిన తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని సీఎం జగన్ ను బుధవారం కలిశారు. గురువారం వెంటనే ఆయనకు ఎంపీ టికెట్ ను కేటాయిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.