ఎస్మా విధిస్తే, ఉద్యోగులుగా గుర్తించినట్లే
ఏపీ అంగన్వాడి వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుబండి చంద్రావతి
కాకినాడ : అంగన్వాడీలు సమ్మెపోరాటం 28వ రోజులు చేరుకుంది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 24 గంటలు దీక్షలు మూడో రోజు శిబిరాన్ని ఏపీ అంగన్వాడి వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుబండి చంద్రావతి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, సిఐటియు సీనియర్ నాయకులు మెడిశెట్టి వెంకటరమణ ప్రారంభించి మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ వేతనాలు ఒకసారి మాత్రమే పెంచుతామని, రెండు మూడు సార్లు పెంచలేమని చెప్పడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 2019 నుండి ధరలు ఒకసారి మాత్రమే పెరగలేదని జగన్మోహన్ రెడ్డి ప్రతినెలా కరెంటు చార్జీలు పెంచుతున్నాడని, చెత్త పను పేరుతో కొత్త రకాల పన్నులు వేస్తూ, కూరగాయల ధరలు, నిత్యవసరాలు ధరలు అయితే చెప్పనవసరం లేదని అలాంటప్పుడు ఒకసారి వేతనం పెంచితే ఎలా సరిపోతుందని తిరిగి ప్రశ్నించారు. ఎస్మా ప్రయోగించి సెక్షన్ 21 ఐపిసి ప్రకారం అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా జీవో నెంబర్ 2తో గుర్తించినందుకు ధన్యవాదాలు తెలిపారు, క్లాస్ ఫోర్ ఎంప్లాయిస్ బేసిక్ వేతనం తక్షణం అంగన్వాడీలకు చెల్లింస్తే సరిపోతుందని తెలిపారు. ఈరోజు 24గంటల రిలే దీక్షలలో ఏపీ అంగన్వాడి వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు దడాల పద్మ, ఉషా, సిహెచ్.రమణమ్మ, ఎస్.బుల్లెమ్మ, రాఘవ, వసంశెట్టి నాగమణి, చేసెట్టి పద్మ, వెంకటలక్ష్మి, సిహెచ్.రత్నమాల, దుర్గా ,నాగలక్ష్మి, గౌరీ,ప్రజావాణి, భవాని, ఎస్.దివ్య, పద్మ, డి.దుర్గా, వీరలక్ష్మి పిఠాపురం ప్రాజెక్టు అంగన్వాడీలు నిర్వహించారు. శిబిరానికి అర్బన్ హెల్త్ సెంటర్స్ యూనియన్ నాయకులు కెపి.నాయుడు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గంగ సూరిబాబు, ఏపీఎస్ ఆర్టీసీ యునైటెడ్ వర్కర్స్ యూనియన్ కాకినాడ డిపో అధ్యక్షులు పీఎస్.రావ్, డిపో కార్యదర్శి బిఎ. రావ్, సామర్లకోట అడ్వకేట్ పోడూరి భాస్కరరావు మద్దతుగా మాట్లాడారు.