బాలాయపల్లి :-
ప్రభుత్వం ఉజ్వల యోజన కింద కొత్తగా 75 లక్షల మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయడం జరిగిందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ,వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్ ఎస్. ఎస్. ఆర్ నాయుడు పేర్కోన్నారు.ఆదివారం
మండలంలోని మన్నూరు గ్రామపంచాయతీలో “వికసిత్ భారత్ సంకల్పయాత్ర ” కార్యక్రమం జరిగింది.ఈసందర్భంగా ఆయన మాట్లాడూతూ
జన్‌ధన్ యోజన కింద దేశ మొత్తం మీద 50 కోట్ల మందికి జీరో బ్యాలెన్స్ అకౌంట్లను కల్పించారని, విశ్వకర్మ యోజన కింద 18 కులాల చేతివృత్తుల వారికి 15 రోజులపాటు శిక్షణ ఇచ్చి ఆ శిక్షణలో రోజుకి 500 రూపాయలు బత్తా ఇచ్చి 15 రోజుల తర్వాత వారికి అవసరమైన పనిముట్లను 15 వేల రూపాయల వరకు విలువ చేసే పనిముట్లను కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని, అంతేకాకుండా వీటి ద్వారా తక్కువ వడ్డీతో రుణాలు ఇస్తున్నారని వాటిని అందరూ సద్వినియోగపరుచుకోవాలని తెలియజేశారు. అలా అనేక కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి, వాటి ప్రయోజనాల గురించి వివరించారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలందరికీ తెలియజేసే విధంగా అధికారులు చూసుకోవాలని, అర్హులైన వారందరికీ అవి అందేలా చేయాలని,అది ప్రభుత్వ అధికారుల విధి అని తెలియజేశారు.ఆయుష్మాన్ భారత్ కార్డుల పంపిణీ క్యాలెండర్లు,తొమ్మిది సంవత్సరాల సుపరిపాలన కరపత్రములు, అందరికీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బాలాయపల్లి మండల అధ్యక్షులు నీలకంఠం మురళి, మాజీ మండల అధ్యక్షుడు కొండూరు సుధాకర్ ,మండల నాయకులు ఆనందయ్య, వెంకట రమణయ్య, వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు, భారతీయ జనతా పార్టీ మండల మరియు గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పోటో:- మాట్లాడుతున్న ఎస్ఎస్ఆర్ నాయుడు