వెంకటగిరి: తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని బొప్పాపురం లో పట్టణ పలకరింపు కార్యక్రమాన్ని ఆదివారం తెదేపా నాయకులు డాక్టర్ మస్తాన్ యాదవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి గడపను పలకరిస్తూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టనున్న సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ సాగారు. ప్రతి కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతున్న సంవత్సరానికి 15000 చొప్పున తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇవ్వడం జరుగుతుందని, మహిళా శక్తి పథకం ద్వారా సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ లు, 18 సంవత్సరాలు నిండిన మహిళలకు నెల నెల 1500 చొప్పున 59 సంవత్సరాలు వరకు ఇస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని కోరారు. ఈ పలకరింపులో ఎక్స్ ఎం పి టి సి రామచంద్రయ్య, తెదేపా కార్యకర్తలు ఉన్నారు.