ఆంధ్ర ప్రదేశ్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు వారిచే విశాఖపట్నం రేంజ్ పరిధిలో సివిల్ ఎస్సై (పురుషులు/మహిళాలు), ఏ.పి.ఎస్.పి, అర్.ఎస్.ఐ పురుషులు పోస్టులకు తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థులందరూ, ఫిజికల్ మెజర్మెంట్ పరీక్ష మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలలో ఉత్తీర్ణులు అయ్యి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకున్న అభ్యర్థులు తేదీ.08.01.2024 & 09.01.2024 రెండు రోజుల్లో ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య విశాఖపట్నం రేంజ్ పోలీస్ కార్యాలయానికి అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో వచ్చి అటెస్టేషన్ ఫామ్స్ నింపి, తదుపరి ఉత్తర్వులు స్వీకరించేందుకు హాజరుకావాలని
విశాఖపట్నం రేంజ్ ఐజీ శ్రీ ఎస్.హరికృష్ణ ఐపీఎస్ గారు ఈ ప్రకటన ద్వారా తెలియజేశారు.
గమనిక అభ్యర్థులు రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి రావలసి ఉన్నందున మెయిన్ పేపర్ లో వార్త వచ్చే విధంగా చూడాలని మనవి.
విశాఖపట్నం రేంజ్ పోలీస్ కార్యాలయము, విశాఖపట్నం.