చర్యలు తప్పవని హెచ్చరిక
5 లోపు విధులకు హాజరుకావలని నోటీసులు
సమ్మె విరమించబోమని స్పష్టం
బాలాయపల్లి :-
పనికి తగిన పరితోషకం ఇవ్వకుండా వెట్టిచాకిరి చేస్తున్నామని మహిళా శిశు సంక్షేమశాఖకు చెంది న ఐసీడీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న అంగన్వా డీ కార్యకర్తలు, ఆయాలు 11 డిమాండ్లతో గత నెల(డిశంబరు)12 నుంచి సమ్మెలో ఉండటంతో ఈనెల 5లోగా విధుల్లోకి హాజరుకావాలంటూ కలెక్టర్ పేరిట ఐసీడీఎస్ అధికారులు నోటీసులు జారీచేశారు. అంగన్వాడీలు కోరిన డిమాండ్లలో చాలా వరకు పరిష్కరించటం జరిగిందని పేర్కొం టూ కలెక్టర్ పేరిట నోటీసుల్లో పేర్కొన్నారు.
చర్యలు తప్పవని హెచ్చరిక :-
అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ఈనెల 5లోగా విధుల్లోకి హాజరుకావాలంటూ కలెక్టర్ పేరిట నోటీసులు జారీచేశారు.విదులకు హాజరుకాక పోతే శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరిం చారు.అంగన్వాడీలు కోరిన డిమాండ్లలో చాలా వరకు పరిష్కరించటం జరిగిందని పేర్కొంటూ కలెక్టర్ పేరిట నోటీసుల్లో ఉంది. సమ్మెలో సిబ్బంది ఉండటంతో లబ్ధిదారులకు అదనపు పోషకాహారం అందటం లేదని, ఆరోగ్యపర్యవేక్షణ కరవైందని నోటీసులో తెలిపారు. ఈనెల 5లోగా విధులకు హాజరుకాలేని పక్షంలో ప్రభుత్వ నియమ నిబంధ నలను అనుసరించి శాఖాపరమైన చర్యలు తీసు కుంటామని నోటీసుల ద్వారాహెచ్చరించారు.
సమ్మె విరమించబోమని స్పష్టం :-
కేంద్రాల వద్ద నోటీసులు అతికించినా, తాము సమ్మె విరమించబోమని అంగన్వాడీలు స్పష్టం చేస్తున్నారు.తాము చేస్తున్న డిమాండ్లు చేస్తున్నా రు.ఇంటర్మీడియట్ చదివి, 35 సంవత్సరాల వయసు మించని వాలంటీర్ల పేర్లను సేకరించాలని ఇప్పటికే ఆయా పర్యవేక్షకులు ఎం.ఎస్.కె.లను ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో అంగన్వాడీ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఒక వేళ తమ బాధ్యతలను వాలంటీర్లకు అప్పగిస్తే ఉద్యమాన
మాన్ని కేంద్రం వద్దనే నిర్వహింస్తామని తెలుపుతున్నారు.
మొండి వైఖరి మానుకోవాలి… స్వరూపరాణీ
వెంకటగిరి ప్రజేక్టు ఐసీడీఎస్ నాయకరాలు, అంగనవాడి రాష్ట్ర నాయకురాలు :-
రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి మానుకోవాలి… స్వరూప రాణి అంగనవాడి రాష్ట్ర నాయకురాలు 26 రోజులు నుంచి సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభు త్వం పట్టించుకోకుండా తమపై నోటీసులు ఇవ్వ డం దారుణమని అంగనవాడి రాష్ట్ర నాయకు రాలు సరూపరని మండిపడ్డారు తాము అడుగు తున్నది కార్మిక చట్టం ప్రకారం పనికి తగ్గ వేతనం అది ఇచ్చేందుకు ఎందుకు ఇంత నిర్లక్ష్య దూరంలో రాష్ట్ర ప్రభుత్వం ఉందో అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.అంగనవాడి కేంద్రంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తలు, ఆయాలు అతి తక్కువ పారితోషకముతో పనిచేస్తున్నాం. నిత్యావసర రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి ఆ దృష్టితో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించి తమ డిమాండ్లను పరిష్కారం మాత్రం చేపట్టేంతవరకు ఎన్ని నోటీసు లు వచ్చినా కేసులు పెట్టి జైళ్లకు పంపించిన ధర్నా లు కొనసాగిస్తామని హెచ్చరించారు.
పోటో:- కలెక్టర్ పేరుట నోటీసులు
పోటో:- సమ్మే చేస్తున్నా అంగనవాడిలు
ఫోటో:- స్వరూప రాణి అంగనవాడి రాష్ట్ర నాయకురాలు