వార్తా ప్రభ- 2024 క్యాలెండర్ ఆవిష్కరించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ : నూతన సంవత్సరంలో అందరికీ శుభాలు జరగాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. అలాగే వార్తా ప్రభ దినపత్రిక ఎప్పటిలాగే తన విశిష్టతను చాటుకొంటూ ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. 2024 క్యాలెండర్ ని మాజీ మంత్రి, పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు తన స్వగృహంలోని కార్యాలయంలో శుక్రవారం ఆవిష్కరించారు. అలాగే విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తన ఛాంబరులో వార్తా ప్రభ దినపత్రిక 2024 క్యాలెండర్ ని ఆవిష్కరించారు. ఆమె కూడా వార్తా ప్రభ దినపత్రిక లో వచ్చే వార్తల తీరుపై అభినందించారు. కార్యక్రమంలో వార్తా ప్రభ దినపత్రిక స్టేట్ బ్యూరో చీఫ్ యేమినేని వెంకట రమణ, సీనియర్ జర్నలిస్టులు ఇస్కా రాజేష్ బాబు, తాళ్లూరి అనిల్ కుమార్, నాగోతి శ్రీనివాసరావు (ఎన్ ఎస్ ఆర్), దుర్గాశి సాయి కుమార్, పిల్లా ఆనంద్, వైసీపీ కార్పొరేటర్లు యరడ్ల ఆంజనేయరెడ్డి, భాపతి కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.