న్యూయార్క్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల (2020) ఫలితాలను తారుమారు చేసేందుకు
ప్రయత్నించారన్న అభియోగాలపై గత గురువారం జార్జియాలో అరెస్టయి, 20 నిమిషాల పాటు
జైలుకెళ్లిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు విరాళాలు
వెల్లువెత్తుతున్నాయి. తాజా పరిణామాలతో గత రెండు రోజుల్లోనే తమకు 71 లక్షల
డాలర్ల (సుమారు రూ.58 కోట్లు) విరాళాలు అందినట్లు ట్రంప్ ఎన్నికల ప్రచార
బృందం వెల్లడించింది. అరెస్టయ్యాక నిందితులను తీసే ఫొటోను మగ్షాట్గా
పిలుస్తారు. ట్రంప్ కూడా గురువారం అలాంటి ఫొటో దిగాల్సి వచ్చింది. అది ఆయనకు
కాసుల వర్షం కురిపిస్తోంది. ఆయన మగ్‌షాట్‌తో కూడిన టీషర్ట్లు, బీర్ కూజీలు,
బంపర్ స్టిక్కర్లు, పోస్టర్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.