పెద్ద పీఠ వేసి ప్రతి గడపకు సంతృప్తి స్థాయిలో సంక్షేమ పథకాలు.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్
బాషా.
గడప గడపకు మన ప్రభుత్వం’లో భాగంగా.. 22/2 వ డివిజన్ మారుతీ నగర్ సచివాలయం- 4
మృత్యుంజయ కుంట, సూర్య హస్పిటల్ వీధులలో ని పలు ప్రాంతాలలో పర్యటన.
కడప, : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం లొనే
మైనారిటీలకు పెద్ద పీఠ వేసి ప్రతి గడపకు సంతృప్తి స్థాయిలో సంక్షేమ పథకాలు
అందిస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని
దీవించాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ అన్నారు. ఆదివారం నగరంలోని
22/2 వ డివిజన్ పరిధిలోని కార్పొరేటర్ ఇంఛార్జి ఈ. రామచంద్రయ్య ఆధ్వర్యంలో
మృత్యుంజయ కుంట, సూర్య హస్పిటల్ సచివాలయం- 4 పరిధిలోని మృత్యుంజయ కుంట,
సూర్య హస్పిటల్ మసీదు ప్రాతంలోని వీధులలో ని పలు ప్రాంతాలలో పర్యటన. 109 వ
రోజు న “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.
అంజాద్ బాషా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి స్థానిక
కార్పొరేటర్, నాయకులు, అధికారులతో కలిసి ఆయా వీధుల్లో నివాసాలన్నింటినీ
తిరిగారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు
వివరించి.. ప్రభుత్వ పథకాల లబ్దిదారులతో నేరుగా మాట్లాడారు. పథకాల లబ్ధి
సమాచారంతో కూడిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంతకం చేసిన
బుక్ లెట్‌ను అందజేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు
పొందుతున్నవారు ప్రభుత్వ పాలనపై సంతృప్తి వ్యక్తం చేయగా.. పలువురు తమ సమస్యలను
అంజాద్ బాషా దృష్టికి తీసుకురాగా.. వెంటనే పరిష్కరించాలని సంబందిత అధికారులకు
రెఫర్ చేశారు.
రాష్ట్ర ప్రజల సంక్షమం, అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయంగా.. రాష్ట్ర
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారన్నారు. రాష్ట్ర
ప్రభుత్వం పేద ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏవిధంగా ప్రజలకు
చేరుతున్నాయని.. ఉపముఖ్యమంత్రి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి
కుటుంబానికి సంక్షేమ ఫలాలు సంతృప్త స్థాయిలో అందడం.. జగన్ మోహన్ రెడ్డి
పారదర్శక పాలనకు అద్దం పడుతోందన్నారు.
కార్యక్రమంలో… ప్రతి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ
పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై లబ్దిదారుల మనోభావాలను తెలుసుకుంటూ ముందుకు
సాగారు.
1)షేక్ నూర్జహాన్ అనే మహిళ తనకు వైఎస్ ఆర్ పింఛన్ కానుక, జగనన్న అమ్మ ఓడి,
జగనన్న ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి నగదుల ద్వారా రూ.09 లక్షల, 96 వేలు
లబ్ధి చేకూరిందని ఆనందం వ్యక్తం చేసింది. ఇన్ని సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం
లో మాకు అందలేదని ఇలాంటి ముఖ్యమంత్రి కి ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు.*
2)సయ్యద్ మస్తాన్ బీ అనే మహిళ తనకు జగనన్న అమ్మ ఓడి, జగనన్న ఇంటి స్థలం, ఇంటి
నిర్మాణానికి నగదుల ద్వారా రూ.9 లక్షల 72 వేలు లబ్ధి చేకూరుతుందని ఆనందం
వ్యక్తం చేసి మా కుటుంబం అంతా సంతోషంగా ఉన్నామని, మా చల్లని దీవెనలతో ఇలాంటి
ముఖ్యమంత్రి కలకాలం ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.*
3)ఎస్. జమృత్ అనే మహిళ తనకు జగనన్న అమ్మ ఒడి, జగనన్న ఇంటి స్థలం, ఇంటి
నిర్మాణానికి నగదుల ద్వారా రూ. 9 లక్షల, 05 వేలు మా కుటుంబానికి ఎంతో లబ్ధి
చేకూరిందని ఈ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ బాసటగా ఉంటామని ఆనందం వ్యక్తం చేసింది*
4)సయ్యద్ నజిమ అనే మహిళ తనకు జగనన్న అమ్మ ఓడి, జగనన్న ఇంటి స్థలం, ఇంటి
నిర్మాణానికి నగదుల ద్వారా రూ. 9 లక్షల 05 వేలు లబ్ది చేకూరిందని ఈ
ప్రభుత్వానికి బాసటగా ఉంటామని ఆనందం వ్యక్తం చేశారు*
5)షేక్ రషీద అనే మహిళ తన కుటుంబానికి జగనన్న ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి
నగదుల ద్వారా రూ. 8 లక్షల 50 వేలు లబ్ది చేకూరిందని ఇంత పెద్ద మొత్తంలో ఏ
ప్రభుత్వం సహయం అందించలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కి కలకాలం రుణ పడి ఉంటామని
ఆనందం వ్యక్తం చేశారు.*
ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రితో పాటు నగర 22 వ డివిజన్ కార్పొరేటర్ ఈ.
రామచంద్రయ్య, రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పులి సునీల్ కుమార్,
కార్పొరేటర్లు త్యాగరాజు, బసవరాజు, వైకాపా నాయకులు నారపురెడ్డి
సుబ్బారెడ్డి, తోట కృష్ణ, పెద్దిరెడ్డి రామ్మోహన్ రెడ్డి, నాయకురాళ్లు టి.వి
సుబ్బమ్మ, మూలే సరస్వతి ,సునీత రెడ్డి, తులసమ్మ, పసుపులేటి విజయ కుమారి, ఇతర
నగర కార్పొరేటర్లు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, కార్యకర్తలు తదితరులు
పాల్గొన్నారు.