అమరావతి : ప్రపంచ రవాణా వ్యవస్థలో ‘ఆవేరా’ విప్లవాత్మక పురగోతి దిశగా
అడుగులేస్తోంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ పరిశ్రమలో అగ్రగామిగా
ఆవిర్భవించింది.స్థిరమైన విద్యుత్ సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ వాహనాలను
అందించడానికి ఆవేరా కట్టుబడి ఉంది. సంప్రదాయ గ్యాసోలిన్ -విద్యుత్ ఆధారిత
గ్రీన్ ఎనర్జీ రవాణా వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. విజయవాడలోని
నున్నలో ఆవిర్భవించిన ‘ఆవేరా’ ప్రపంచ వేదికపై వేగంగా దూసుకుపోతోంది. రూ.100
కోట్ల విస్తరణ ప్రణాళికతో ముందుకు సాగుతోంది.ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏటా
25,000 వాహనాల నుంచి లక్ష వాహనాలకు పెంచడమే లక్ష్యంగా అడుగులేస్తోంది. ఈ
విస్తరణతో 55 మంది నైపుణ్యం కలిగిన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించనుంది.
ప్రస్తుత ఏడాదిలో ఆస్ట్రేలియా, వియత్నాం , శ్రీలంకలో విస్తరించేందుకు ఆవేరా
సన్నద్ధమైంది. అందులో భాగంగా ఇప్పటికే వియత్నాం, శ్రీలంకలో పైలట్
ప్రోగ్రామ్‌లను ప్రారంభించింది. ఆస్ట్రేలియాలో పైలట్ ప్రయోగం నవంబర్‌లో
జరగనుందని ఆవేరా పరిశ్రమ వ్యవస్థాపకుడు, సీఈవో వెంకట రమణ వెల్లడించారు. ఆవేరా
సంస్థ సగర్వంగా రూ.1.41,992 తక్కువ ధరకే “విన్సెరో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను
త్వరలోనే ఆవిష్కరించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దీనికి సంబంధించి రూ.2023
చెల్లించి స్కూటర్ బుక్ చేసుకునే సదుపాయం కల్పించినట్లు తెలిపారు.
ఈ మైలు రాయి సాధించిన నేపథ్యాన్ని పురస్కరించుకుని విన్సెరో ఎలక్ట్రిక్
స్కూటర్ కోసం డైరెక్ట్ కస్టమర్లకు రూ.10,000.00 ప్రత్యేకంగా తగ్గింపు ఆఫర్
ఇస్తున్నట్లు వివరించారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రపంచ వేదికపై స్థిరమైన ,
వినూత్నమైన ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్స్‌లో అగ్రగామిగా నిలిచేందుకు
కీలకమైన పురోగతిని సూచిస్తుందని సీఈవో వెంకట రమణ పేర్కొన్నారు. సంప్రదాయ
ద్విచక్ర వాహనాలను పునర్నిర్మించడంపై వ్యూహాత్మక దృష్టితో ఆవేరా పట్టణ వాయు
కాలుష్యం యొక్క తీవ్రమైన సవాలును అధిగమించడంపై ప్రత్యేక దృష్టి సారించింది.
సరసమైన, ఇంధన-సమర్థవంతమైన ఎలక్ట్రిక్ స్కూటర్లు , మోటార్‌సైకిళ్లను అందించడం
ద్వారా ఆవేరా కంపెనీ కేవలం భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ సరిహద్దులదాటి
ద్విచక్ర వాహన పరిశ్రమలో పరివర్తనాత్మక మార్పుకు నాయకత్వం వహిస్తోంది.