‘జైలర్’ విజయంతో ఫుల్ జోష్ ఉన్నారు కథానాయకుడు రజనీకాంత్. ఇప్పుడీ ఉత్సాహంలోనే
తదుపరి సినిమాపై దృష్టి సారించారు. ఆయన నటించనున్న ఈ 170వ చిత్రాన్ని టి.జె.
జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ సంస్థ
నిర్మిస్తోంది. ఈ సినిమా తాజాగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైనట్లు
సమాచారం. చెన్నైలోని ఓ ప్రముఖ హోటల్లో ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. వచ్చే
నెల మూడోవారం నుంచి రెగ్యులర్ గా చిత్రీకరణ ప్రారంభించేందుకు సన్నాహాలు
చేస్తున్నట్లు తెలిసింది. వాస్తవిక సంఘటనల ఆధారంగా అల్లుకున్న కథతో
రూపొందనున్న ఈ సినిమాలో రజనీ పోలీసుగా కనిపించనున్నట్లు ప్రచారం
వినిపిస్తోంది. అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. శర్వానంద్ సైతం ఓ
ముఖ్య పాత్రలో కనిపిస్తారని వినికిడి. ‘జైభీమ్’ లాంటి విజయం తర్వాత జ్ఞానవేల్
తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో దీనిపై ప్రేక్షకులలో ఇప్పటికే భారీ అంచనాలు
నెలకొని ఉన్నాయి.