మారతారు. వారికి ఇదొక ఎమోషనల్ రోలర్ కాస్టర్ అనుభూతి కలిగిస్తుంది. తరచూ మూడ్
స్వింగ్స్ మారుతుంటాయి. ఇలాంటి సమయంలో కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా
పీరియడ్స్ సమయంలో మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అవేంటో చూద్దాం..
1.స్వీట్స్ తినకండి:
పీరియడ్స్ సమయంలో కొంతమంది స్వీట్స్ ఎక్కువగా తింటుంటారు. ఇలా చేయడం వల్ల
రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి మానసిక స్థితిపై నెగిటివ్ ప్రభావం పడుతుంది.
2.సెరటోనిన్ కోసం:
మానసిక స్థితిని మెరుగుపర్చే న్యూరో ట్రాన్స్ మిటర్ సెరటోనిన్. ఇది రుతుస్రావం
సమయంలో చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో సెరటోనిన్ ఉత్పత్తిని పెంచే
చికెన్, గుడ్లు, మొలకెత్తిన విత్తనాలు, గింజలు తీసుకోవడం మంచిది.
3.మెగ్నీషియం
మానసిక ఆందోళనను తగ్గించడంలో మెగ్నీషియం కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే
పీరియడ్స్ సమయంలో మెగ్నీషియం ఎక్కవగా ఉండే ఆకుకూరలు, బాదం, జీడిపప్పు,
గుమ్మడికాయ, పొద్దుతిరుగుడు విత్తనాలు, చిక్కుడు, తృణధాన్యాలు తీసుకోవడం
మంచిది.
4.విటమిన్ బి:
మానసిక ఆరోగ్యాన్ని కాపాడటంలో విటమిన్ బి కాంప్లెక్స్ ముఖ్యపాత్ర పోషిస్తుంది.
ముఖ్యంగా విటమిన్ బి6 నిరాశ, చిరాకు లక్షణాలను తగ్గిస్తుంది. కాబట్టి విటమిన్
బి ఎక్కువగా ఉండే కొవ్వు చేపలు, గుడ్లు, ఆకుకూరలు, బీన్స్ తీసుకోవాలి.
5.హెర్బల్ టీ:
పీరియడ్స్ సమయంలో హెర్బల్ టీలు తీసుకోవడం మంచిది. ఎందుకంటే పుదీనా, అల్లం వంటి
హెర్బల్ టీలు మానసిక ప్రశాంతతను అందిస్తాయి. ఒత్తిడి, ఆందోళనను నివారిస్తాయి.
6.వ్యాయామం:
పీరియడ్స్ సమయంలో కొందరు వ్యాయామం చేయకుండా ఉంటారు. అయితే మీ మానసిక ఆరోగ్యంతో
పాటు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం వ్యాయామం చేయడం మంచిది. వాకింగ్,
జాగింగ్, డ్యాన్స్ లేదా యోగా చేయొచ్చు.
7.మాట్లాడండి:
మానసికంగా ఆరోగ్యంగా ఉండటం కోసం మీకు నచ్చిన వ్యక్తితో మాట్లాడండి. ఇలాంటి
సమయంలో ఇది మీకు మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
8.మ్యూజిక్:
మంచి సంగీతం వినడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
అందువల్ల పీరియడ్స్ సమయంలో మీకు నచ్చిన పాటలు వినండి.