రామాయణం ఇతిహాసం ఆధారంగా హిందీలో మరో చిత్రం తెరకెక్కబోతున్నది. నితీష్ తివారి
దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, మధు మంతెన భారీ స్థాయిలో
నిర్మించబోతున్నారు. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్, సీత పాత్రలో అలియాభట్
నటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్
నుంచి అలియాభట్ తప్పుకుందని తెలిసింది. ప్రస్తుతం హాలీవుడ్ తో పాటు బాలీవుడ్
ప్రాజెక్ట్ తో బిజీగా ఉండటం వల్ల రామాయణం చిత్రానికి ఆమె డేట్స్
కేటాయించలేకపోతున్నదని సమాచారం. ఈ నేపథ్యంలో సీత పాత్రలో సాయిపల్లవి పేరును
పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ దిశగా సంప్రదింపులు పూర్తయ్యాయని, ఈ
సినిమాలో నటించేందుకు సాయి పల్లవి సానుకూలంగా ఉందని వార్తలొస్తున్నాయి.
ఇటీవలకాలంలో సాయిపల్లవి సినిమాల విషయంలో సెలెక్టివ్ ఉంటున్నది. ‘లవ్ స్టోరీ’
తర్వాత తెలుగులో మరే చిత్రం లోను నటించలేదు.