విద్యా రంగ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న ముఖ్యమంత్రి
హెలిప్యాడ్, బహిరంగ సభ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రులు,
కలెక్టర్
నగరి నియోజకవర్గం నుండి జగనన్న విద్యా దీవెన కార్యక్రమం ను లాంఛనంగా
ప్రారంభించడం సంతోషకరం
రాష్ట్ర విద్యుత్, అటవీ, శాస్త్ర సాంకేతిక, భూ గర్భ గనుల శాఖ మంత్రి పెద్ది
రెడ్డి రామచంద్రా రెడ్డి
నగరి : జగనన్న విద్యా దీవెన ఏప్రిల్ – జూన్ 2023 త్రైమాసిక లబ్ధి ని చిత్తూరు
జిల్లా నగరి నుండి రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్
మోహన్ రెడ్డి సోమవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి అన్ని
ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. సభా వేదిక, హెలిప్యాడ్ వద్ద
పటిష్టంగా గ్యాలరీల నిర్వహణ, తాగునీటి సదుపాయం తదితర ఏర్పాట్లు, గ్రీన్ రూమ్
తో పాటు ఇతరత్రా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. బహిరంగ సభ వద్ద
మరియుహెలిప్యాడ్ వద్ద జరుగు తున్న పనులను మంత్రులు డిప్యూటీ సీఎం కే.
నారాయణస్వామి, రాష్ట్ర అటవీ,విద్యుత్, పర్యావరణ శాస్త్ర సాంకేతిక భూగర్భ గనుల
శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర సాంస్కృతిక,
యువజనాభివృద్ధి శాఖ మంత్రి ఆర్కే రోజా, రాజంపేట చిత్తూరుపార్లమెంటు సభ్యులు
పెద్దిరెడ్డి వెంకట మిధున్ రెడ్డి,ఎన్. రెడ్డప్ప,జడ్పీ చైర్మన్ గోవిందప్ప
శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ ఎస్.షన్మోహన్, ఎస్పీ వై. రిశాంత్ రెడ్డి,
ముఖ్యమంత్రి పర్యటనలప్రభుత్వ సలహాదారు మరియు ఎమ్మెల్సీ తలశీల రఘురాం, ఎం ఎల్
సి లు భరత్, సిపాయి సుబ్రహ్మణ్యo, జిల్లా జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు,
సత్యవేడు శాసనసభ్యులు ఆదిమూలం, డిఆర్ఓ ఎన్.రాజశేఖర్ పరిశీలించారు. బహిరంగ
సభ వద్ద ఎల్ఈడి స్క్రీన్,బ్యారికేడింగ్, సీటింగ్ అరేంజ్మెంట్, సభకు వచ్చే
ప్రజలకు త్రాగునీటి వసతి శానిటేషన్ ఏర్పాట్లు ను పరిశీలించారు. ఈ సందర్భంగా
విద్యా రంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టి పలు సంస్కరణలు చేపట్టి విద్యా
రంగ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని
రాష్ట్ర విద్యుత్, అటవీ, శాస్త్ర సాంకేతిక, భూ గర్భ గనుల శాఖ మంత్రి డా.
పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి పేర్కొన్నారు.