*హైదరాబాద్ : రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. శుక్రవారం
రాష్ర్టానికి రెండు పెట్టుబడులు వచ్చి చేరాయి. ఇప్పటికే తెలంగాణలో
కార్యకలాపాలు కొనసాగిస్తున్న ప్రముఖ అంతర్జాతీయ సంస్థ మార్స్ గ్రూప్ అదనంగా
రూ.800 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించింది. మరోవైపు ప్రముఖ
అంతర్జాతీయ సంస్థ ‘ఓమ్నికాం మీడియా గ్రూప్’ హైదరాబాద్‌లో పెట్టుబడి
పెట్టేందుకు సిద్ధమైంది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు
చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. దీంతో సుమారు 2,500 మందికి ఉపాధి
లభించనున్నది. అమెరికా పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ శుక్రవారం న్యూయార్క్
నగరంలో రెండు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు.
పెంపుడు జంతువులు (పెట్స్) తినే ఆహార ఉత్పత్తుల్లో సుప్రసిద్ధమైన మార్స్
గ్రూప్ నుంచి చీఫ్ డేటా అండ్ అనలిటిక్స్ ఆఫీసర్ శేఖర్ కృష్ణమూర్తి బృందం
సమావేశమైంది. ఈ సందర్భంగా సంస్థ విస్తరణ ప్రణాళికలను, నూతన పెట్టుబడి వివరాలను
ప్రకటించారు. తెలంగాణలో ఇప్పటికే సిద్దిపేట కేంద్రంగా కొనసాగుతున్న తమ
పెట్టుబడి, కార్యకలాపాల అనుభవాల పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. భారత్‌లో తమ
ఉత్పత్తులకు అద్భుతమైన స్పందన వస్తుందని పేర్కొన్నది. పెట్ కేర్, పెట్స్
ఫుడ్‌కు డిమాండ్ మరింత పెరుగుతుందన్న అంచనాల నేపథ్యంలో తెలంగాణ కేంద్రంగా
మరింత విస్తరించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నది.*

మంత్రి కేటీఆర్ హర్షం : ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
మార్స్ గ్రూప్‌కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణకు కొత్త కంపెనీల పెట్టుబడులు
రావడానికి ఎంత ప్రాధాన్యం ఇస్తామో, ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న
కంపెనీలు తిరిగి తెలంగాణలో పెట్టుబడి పెట్టడానికి అంతే ప్రాధాన్యం
ఇస్తామన్నారు. ఈ దిశగా ఇప్పటికే తెలంగాణ కేంద్రంగా పనిచేస్తున్న అనేక కంపెనీలు
పెద్ద ఎత్తున తిరిగి రాష్ట్రంలో విస్తరణకు పెట్టుబడులు పెడుతున్నాయని
చెప్పారు. దీంతో స్థానికంగా భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు.