హైదరాబాద్ : రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో గుడి, చర్చి, మసీదుల ప్రారంభం ఘనంగా
జరిగింది. సర్వమత సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేలా నిర్మించిన ప్రార్థనా
మందిరాలను గవర్నర్ తమిళిసైతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు.
నల్లపోచమ్మ ఆలయ పూర్ణాహుతి కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్
పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చర్చి ప్రారంభ
వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో
పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం మసీదును ప్రారంభించారు. ఈ సందర్భంగా నమాజ్
చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి,
కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ప్రభుత్వ
ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.