మహేష్ బాబు కథానాయకుడిగా అగ్ర దర్శకుడు రాజమౌళి ఓ చిత్రాన్ని
తెరకెక్కించబోతున్న విషయం అందరికి తెలిసిందే. జంగిల్ అడ్వెంచర్ నేపథ్యంలో
హాలీవుడ్ స్థాయి ప్రమాణాలతో ఈ సినిమాకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి
రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్ కథను సమకూర్చుతున్నారు. తాజాగా ఆయన ఈ
సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను వెల్లడించారు. ఆఫ్రికా
నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇదని, ఈ సినిమాలో కొందరు
హాలీవుడ్ నటులు కూడా భాగం కాబోతున్నారని విజయేంద్రప్రసాద్ తెలిపారు. గ్లోబల్
ఆడియెన్స్ కు రీచ్ అయ్యే కథాంశమిదని దర్శకుడు రాజమౌళి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో
తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన హాలీవుడ్ నటులను కూడా తీసుకోతున్నారని సమాచారం. ఈ
చిత్రంలో మహేష్ బాబు పాత్రను హనుమంతుడిని స్ఫూర్తిగా తీర్చిదిద్దుతున్నారని,
హనుమాన్ లక్షణాలు మూర్తీభవించిన కథానాయకుడిగా ఆయన పాత్ర చిత్రికరణ ప్రత్యేకంగా
ఉంటుందని చెబుతున్నారు. ఈ ఏడాది చివరిలో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్ల ముందని
తెలిసింది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు ‘గుంటూరు కారం’
చిత్రంలో నటిస్తున్నారు.