వెలగపూడి : కాకినాడ-శ్రీకాకుళం మధ్య ఏర్పాటు చేస్తున్ననాచురల్ గ్యాస్ పైపులైను
పనులను వేగవంతంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్
రెడ్డి చెప్పారు. శుక్రవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఈఅంశంపై ఆయన
అధికారులతో సమీక్షించారు. వచ్చే ఏడాది జూన్ నాటికి ఈపైపు లైనును ఏర్పాటు
చేయాల్సి ఉన్నందున పనులు వేగవంతంగా చేయాలని సిఎస్ చెప్పారు. ఈపైపు లైను
ఏర్పాటుకు సంబంధించిన ప్రగతిని,వివిధ అంశాలను రాష్ట్ర ఇండస్ట్రీస్,
ఇన్వెస్టుమెంట్స్ శాఖ (ఐఅండ్ఐ) కార్యదర్శి ఎన్.యువరాజ్ పవర్ పాయింట్
ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం ఉభయ గోదావరి జిల్లాల్లో ఏర్పాటు
చేస్తున్న గోదావరి గ్యాస్ పైపు లైను డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్కు ప్రాజెక్టుకు
సంబంధించిన ప్రగతిని సమీక్షించారు. ఈసమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ కమీషనర్,
ఎండి ఎపిజిడిసి కె.ప్రవీణ్ కుమార్,ఎపి మారిటైం బోర్డు డిప్యూటీ సిఇఓ
రవీంద్రనాధ్ రెడ్డి, పిసిబి సిఇ శ్రీనివాసరావు, ఎస్ఇ మురళి, జిజిపిఎల్ సిఎఫ్ఓ
ఎ.సాహు,ఎపి జిడిసి చీఫ్ మేనేజర్ విజయ భాస్కర్, జిజిపిఎల్ ఎండి ఫంకజ్ భగత్
పాల్గొనగా వీడియో లింక్ ద్వారా ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్ పాల్గొన్నారు