ప్రయోజనాలు ఉన్నాయి.
1. బీరకాయలో కొవ్వులు తక్కువగా, నీరు, ఫైబర్ ఎక్కువగా ఉండి, పోషకాలు అధికంగా
ఉండడంతో పాటు తొందరగా జీర్ణం అవుతుంది.
2.బీరకాయలో విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి6, పొటాషియం,
సోడియం, జింక్, కాపర్, థైమీన్ వంటి పోషకాలు ఉంటాయి.
3. బీరకాయలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది తరచుగా తీసుకుంటే ఐరన్ లోపం కారణం
వచ్చే రక్తహీనత సమస్య నయం అవుతుంది.
4. బీరకాయలో విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది, ఇది ఐరన్ తో పాటు శరీరంలోని
ఎర్రరక్తకణాల సరైన సంశ్లేషణలో కీలక పాత్ర పోషిస్తుంది.
5. ఇది శరీరంలోని అన్ని అవయవాలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
6. నొప్పి, అలసట వంటి లక్షణాలను తగ్గిస్తుంది.
7. బీరకాయలో నీరు పుష్కలంగా ఉంటుంది.
8.బీరకాయ గుజ్జులో సెల్యులోజ్, ఫైబర్ మెండుగా ఉంటుంది. ఇది పేగుల కదలికను,
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
9. మలబద్ధకం సమస్యతో బాధపడేవారు వారి డైట్ బీరకాయ తీసుకుంటే ఈ సమస్య దూరం
అవుతుంది. మలబద్ధకంతో బాధపడేవారు ఒక గ్లాస్ బీరకాయ రసంలో తేనె కలిపి తాగితే
మలబద్దకం సమస్య దూరం అవుతుంది.
10. బీరకాయ శరీరంలోని వ్యర్థాలు, ఆల్కహాల్ అవశేషాలు, జీర్ణం కాని ఆహార కణాలను
శరీరం నుంచి తొలగించి, రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
11. లివర్ ఆరోగాన్ని, పిత్త పనితీరును పెంపొందించడంలో ఇది కీలక పాత్ర
పోషిస్తుంది. లివర్ బైల్ రసాన్ని విడుదల చేస్తుంది. ఇది లిపిడ్లు, కొవ్వులను
విచ్చిన్నం చేయడానికి సహాయపడుతుంది.
12. బీరకాయలో మెగ్నీషియం, పొటాషియం మెండుగాఉంటాయి. హృదయనాళ వ్యవస్థ పనితీరులో
కీలక పాత్రపోషిస్తాయి.
13.ఈ మినరల్స్ కీలక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇవి
ఫ్రీరాడికల్స్ తో పోరాడి గుండె కణాలు నష్టపోకుండా రక్షిస్తాయి.