పోషకాహారం తీసుకోవాలి. ఇక్కడ కొన్ని రకాల టీల గురించి వివరించాం. వీటిని
రెగ్యులర్గా తాగడంతో జుట్టు ఒత్తుగా మారుతుంది.
సేజ్ టీ:
సేజ్ టీలో విటమిన్ కే కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ టీ తాగడంతో గుండె ఆరోగ్యంగా
మారుతుంది. ఎముకలు ధృడం అవుతాయి. ఇందులో ఉన్న కాపర్ జుట్టు తెల్లబడటాన్ని
నివారిస్తుంది. జుట్టును ఒత్తుగా మార్చుతుంది.
గ్రీన్ టీ:
గ్రీన్ టీ తాగడంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు
పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉన్న ఈజీసీజీలు జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.
జుట్టు రాలడాన్ని నివారిస్తాయి.
రోజ్ మేరీ టీ:
ఈ టీ లో ఐరన్, కాల్షియం, విటమిన్ బీ-6 కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇందులో ఉన్న
యాంటీ ఆక్సిడెంట్లు మెదడును ఆరోగ్యంగా మార్చుతాయి. ఈ టీ తాగడంతో నెత్తికి రక్త
ప్రసరణ బాగుంటుంది. జుట్ట మొదళ్ల నుంచి దృఢంగా మారుతుంది.
లావెండర్ టీ:
లావెండర్ టీ సువాసన చాలా బాగుంటుంది. లావెండర్ టీ తాగడంతో ఇన్ఫ్లమేషన్
తగ్గుతుంది. రెగ్యులర్ గా ఈ టీ తాగడంతో వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. ఈ టీ
జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.
జాస్మిన్ టీ:
జాస్మిన్ టీ రుచికరంగా ఉంటుంది. ఇది నెత్తిని ఆరోగ్యంగా ఉంచుతుంది. నెత్తిపై
ఇన్ఫెక్షన్లు రాకుండా చూడటంలో సహాయపడుతుంది. చుండ్రు తగ్గేందుకు ఈ టీ
సహాయపడుతుంది. ఈ టీని రెగ్యులర్ గా తాగడంతో జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
పుదీనా టీ:
పుదీనా తాగడంతో జుట్టు వేగంగా పెరుగుతుంది. ఈ టీ తాగడంతో ఆరోగ్యం
మెరుగుపడుతుంది. ఈ టీలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ టీ తాగడంతో
వ్యాధినిరోధకశక్తి మెరుగుపడుతుంది.
అల్లం టీ:
అల్లం టీ తాగడంతో రక్తప్రసరణ వ్యవస్థ ఆరోగ్యంగా మారుతుంది. ఈ టీ తాగడంతో
జుట్టు వేగంగా పెరుగుతుంది. నెత్తి ఆరోగ్యంగా మారుతుంది. చుండ్రు తగ్గుతుంది.
జుట్టు మూలాల నుంచి దృఢంగా మారుతుంది.
రుయిబోస్ టీ:
రుయిబోస్ టీ తాగడంతో జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఈ టీ తాగడంతో చర్మ ఆరోగ్యం
సైతం మెరుగుపడుతుంది. ఈ టీ తాగడంతో చుండ్రు సమస్య దూరం అవుతుంది. జుట్టు
నల్లగా మారుతుంది.