సహాయపడుడుతుంది. రోగనిరోధకశక్తి మెరుగుపడటంతో వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుంచి
దూరంగా ఉండవచ్చు. విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర
పోషిస్తుంది. గాయాలు త్వరగా మానడానికి ఉపయోగపడుతుంది. ఎముకలను బలంగా మార్చడంలో
సహాయపడుతుంది. దంతాల్లో డెంటిన్ అనే పదార్థం ఏర్పడటానికి విటమిన్ సి అవసరం.
రోజుకు 65 మిల్లీగ్రాముల నుంచి 100 మిల్లీ గ్రాముల విటమిన్ సి అవసరం. మన
దేశంలో సుమారు 60 శాతం మంది విటమిన్ సి లోపంతో ఇబ్బంది పడుతున్నారు.
జలుబు:
జలుబు, ఫ్లూ వంటి సీజనల్ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో విటమిన్ సి సహాయపడుతుంది.
విటమిన్ సి లోపం ఉన్నవారు సులభంగా జలుబు బారిన పడతారు. విటమిన్ సి లోపం ఉన్న
వారికి జలుబు వేగంగా తగ్గదు.
డయాబెటిస్:
విటమిన్ సీ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. విటమిన్ సి
లోపం కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. విటమిన్ సి అధిక
ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది.
గుండె వ్యాధులు:
గుండె సంబంధిత రోగాలను తగ్గించడంలో విటమిన్ సీ ముఖ్య పాత్ర పోషిస్తుంది.
రక్తపోటును నివారించడంలో సైతం విటమిన్ సి సహాయపడుతుంది. విటమిన్ సీ లోపం
కారణంగా గుండె సంబంధిత రోగాలు పెరుగుతాయి.
రక్తహీనత:
విటమిన్ సి ఐరన్ గ్రహించడానికి సహాయపడుతుంది. విటమిన్ సి లోపం కారణంగా
రక్తహీనత వస్తుంది. రక్తహీనతతో ఇబ్బంది పడేవారు విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా
ఉన్న పదార్థాలు తినడం మంచిది.
నోటి సమస్యలు:
విటమిన్ సి లోపం కారణంగా నోటి సమస్యలు అధికం అవుతాయి. ముఖ్యంగా చిగుళ్ల వాపు.
వస్తుంది. దంతాలు బలహీనంగా మారుతాయి. చిగుళ్ల నుంచి రక్తస్రావం అవుతుంది.
వీటిలో అధికం:
విటమిన్ సీ కోసం నారింజ, జామ వంటి సిట్రస్ ఫ్రూట్స్ తినడం ఉత్తమం.
స్ట్రాబెర్రీస్, బ్లాక్ పెప్పర్. బ్రోకలి, బంగాళదుంపల్లో విటమిన్ సి అధికంగా
లభిస్తుంది.