బాషా.
గడప గడపకు మన ప్రభుత్వం’లో భాగంగా మారుతీ నగర్ లో పర్యటన
కడప : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పేద బడుగు
బలహీన వర్గాల ప్రజల అభివృద్ధికి పని చేస్తూ ప్రతి ఇంటికి సంక్షే పథకాలు
అందించడం జరుగుతోందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ అన్నారు. గడప గడపకు
మన ప్రభుత్వం’లో భాగంగా 22/2 వ డివిజన్ రాజారెడ్డి వీధి సచివాలయం-2 లోని
రాజారెడ్డి వీధి వద్ద గల పలు ప్రాంతాలలో పర్యటించారు. స్థానిక 22/2 వ డివిజన్
రాజారెడ్డి వీధి లో పలు ప్రాంతాలను సందర్శించారు.
స్థానిక 27/2 డివిజన్ కార్పొరేటర్ ఈ. రామ చంద్రయ్య ఇంఛార్జి ఆధ్వర్యంలో
సచివాలయం-2 పరిధిలోని రాజారెడ్డి వీధి ప్రాంతంలోని రామాలయం వీధి నుండి పలు
వీధులు, ప్రాంతాలలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
తొలుత రామాలయం వీధి వద్ద నుండి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా
ప్రారంభించారు. అలాగే 22/2 డివిజన్ పరిధిలోని కార్పొరేటర్ ఈ. రామచంద్రయ్య
ఇంచార్జి గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం పూలమాలలు వేసి, బాణసంచాతో
స్వాగతం పలికి ఘనంగా నిర్వహించినందులకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్
బాషా అభినందించారు. 107 వ రోజైన గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా
ఉప ముఖ్యమంత్రి కి అభిమానులు,నగర ప్రజానీకం, మహిళలు సాదర స్వాగతం పలికారు. ఈ
సందర్భంగా ఉపముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం అమలు చేస్తున్న
సంక్షేమ పథకాలు ఏవిధంగా ప్రజలకు చేరుతున్నాయని ఉప ముఖ్యమంత్రి అడిగి
తెలుసుకున్నారు. స్థానిక కార్పొరేటర్, నాయకులు, అధికారులతో కలిసి.. ఆయా
వీధుల్లో నివాసాలన్నింటినీ తిరిగారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ
పథకాలను వారికి వివరించి, వార్డు లోని అన్ని ఇళ్లకు తిరుగుతూ కుటుంబాలను
కలుసుకోవడంతో పాటు, వారు పొందుతున్న లబ్ధి సమాచారంతో కూడిన ముఖ్యమంత్రి వైయస్
జగన్ మోహన్ రెడ్డి సంతకం చేసిన బుక్ లెట్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో
ప్రతి కుటుంబం లబ్ది చేకూరిందని ప్రభుత్వ పాలనపై సంతృప్తి వ్యక్తం చేయగా
పలువురు తమ సమస్యలను అంజాద్ బాషా దృష్టికి తీసుకురాగా వెంటనే పరిష్కరించాలని
సంబందిత అధికారులకు ఆదేశించారు.
రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయంగా ముఖ్యమంత్రి
పనిచేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కుల,మత, పార్టీలకతీతంగా
అర్హత ఉన్న పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందించిన ఏకైక ముఖ్యమంత్రి
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ఏదో ఒక పథకం ద్వారా
ప్రతి గడపకు లబ్ది చేకూరిందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేసారు.
1)రాజేశ్వరి అనే మహిళ తనకు వైఎస్ ఆర్ సున్నా వడ్డీ, జగనన్న అమ్మ ఓడి, వైఎస్
ఆర్ చేయూత, వైఎస్ ఆర్ పింఛన్ కానుక, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన,
జగనన్న ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి నగదుల ద్వారా రూ.10 లక్షల, 97 వేల 914
లు లబ్ధి చేకూరిందని ఆనందం వ్యక్తం చేసింది. ఇన్ని సంక్షేమ పథకాలు ఏ
ప్రభుత్వం లో మాకు అందలేదని ఇలాంటి ముఖ్యమంత్రి కి ఎల్లప్పుడూ అండగా ఉంటామని
తెలిపారు.
2)ఎస్. మల్లికా అనే మహిళ తనకు జగనన్న అమ్మ ఓడి, వైఎస్ ఆర్ ఆసరా, వైఎస్
ఆర్ పింఛన్ కానుక, జగనన్న ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి నగదుల ద్వారా రూ.10
లక్షల, 02 వేల 126 లు లబ్ధి చేకూరుతుందని ఆనందం వ్యక్తం చేసి మా కుటుంబం
అంతా సంతోషంగా ఉన్నామని, మా చల్లని దీవెనలతో ఇలాంటి ముఖ్యమంత్రి కలకాలం
ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
3)పోలు చిట్టి బాబు అనే తనకు వైఎస్ ఆర్ ఆసరా, వైఎస్ ఆర్ సున్నా వడ్డీ,
వైఎస్ ఆర్ పింఛన్ కానుక, జగనన్న ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి నగదుల ద్వారా
రూ. 09 లక్షల, 58 వేల 610 లు లబ్ధి చేకూరుతుందని ఆనందం వ్యక్తం చేసి మా
కుటుంబం అంతా సంతోషంగా ఉన్నామని, మా చల్లని దీవెనలతో ఇలాంటి ముఖ్యమంత్రి
కలకాలం ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
4)దాస్తోతి హరి బాబు అనే తనకు వైఎస్ ఆర్ సున్నా వడ్డీ, జగనన్న అమ్మ ఓడి,
వైఎస్ ఆర్ ఆసరా, జగనన్న చేదోడు, జగనన్న ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి నగదుల
ద్వారా రూ.09 లక్ష, 38 వేల 009 లు లబ్ధి చేకూరుతుందని ఆనందం వ్యక్తం చేసి మా
కుటుంబం అంతా సంతోషంగా ఉన్నామని, మా చల్లని దీవెనలతో ఇలాంటి ముఖ్యమంత్రి
కలకాలం ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
5)వనమాల సుధాకర్ రావు అనే తనకు వైఎస్ ఆర్ చేయూత, వైఎస్ ఆర్ పింఛన్ కానుక,
జగనన్న ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి నగదుల ద్వారా రూ.1 లక్షల 07 వేలు లబ్ది
చేకూరందని ఈ ప్రభుత్వానికి బాసటగా ఉంటామని ఆనందం వ్యక్తం చేశారు. ఈ
కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి తోపాటు కార్పొరేటర్ రామచంద్రయ్య ఇంఛార్జి, సోషల్
వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పులి సునీల్ కుమార్, మార్కెట్ యార్డు ఛైర్మన్
బంగారు నాగయ్య యాదవ్, కార్పొరేటర్లు షేక్ మహమ్మద్ షఫీ, బాల స్వామి రెడ్డి,
త్యాగరాజ్ , సుబ్బారెడ్డి ,రాజశేఖర్ రెడ్డి , వైకాపా నాయకులు అప్జల్ ఖాన్,
నారపురెడ్డి సుబ్బారెడ్డి, ఎన్ఆర్ఐ తోట కృష్ణ, హాజరత్ పీరాన్ మున్నా, పవర్
అల్తాఫ్, అయూబ్ ఖాన్, అహమ్మద్, పస్తం అంజి, సిహెచ్ సునీల్ కుమార్,
సంజీవరావు, నాయకుర్రాళ్లు పత్తి రాజేశ్వరి, ఉమామహేశ్వరి, రత్నకుమారి,
మరియలు, సుశీల, విద్యుత్ డి మహమ్మ రఫీ, నగర కార్పొరేటర్లు సభ్యులు,
సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.*