‘గ్యాంగ్ లీడర్’ ‘శ్రీకారం’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు
తెచ్చుకుంది ప్రియాంక అరుళ్ మోహన్. ప్రస్తుతం ఈ భామ తెలుగులో పవన్ కల్యాణ్
సరసన ‘ఓజీ’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ అమ్మడు
తమిళంలో ఓ బంపర్ ఆఫర్ ను సొంతం చేసుకుందని తెలిసింది. అగ్ర హీరో దళపతి విజయ్
సరసన నటించేందుకు ఈమె అవకాశం దక్కించుకుందని సమాచారం. విజయ్ కథానాయకుడిగా
వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్నది. ఇందులో విజయ్
ద్విపాత్రాభినయంలో కనిపిస్తారని సమాచారం. ప్రధాన నాయికగా జ్యోతిక పేరును
ఇప్పటికే ఖరారు చేశారు. రెండో నాయికగా ప్రియాంక అరుళ్ మోహనను ఎంపిక
చేయబోతున్నట్లు తెలిసింది. గత రెండేళ్లుగా ఈ అమ్మడు. తమిళంలో భారీ విజయాలను
సొంతం చేసుకుంటున్నది. తాజా అవకాశంతో ఈ భామ మరింత గుర్తింపు పొందే అవకాశం ఉంది.