దేశమంతా తిరుగుతూ ‘జైలర్’ విజయ యాత్ర చేస్తున్న రజనీకాంత్ అనుకోకుండా ఓ
వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి
ఆదిత్యనాథ్ ని కలిసినప్పుడు.. ఆయనకు పాదాభివందనం చేయడం దేశవ్యాప్తంగా పెద్ద
చర్చకు దారితీసింది. ముఖ్యంగా తమిళ ప్రజలు దీన్ని జీర్ణించుకోలేక, ఆయనపై పెద్ద
ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విమర్శలపై రజనీకాంత్ చెన్నైలో మంగళవారం
స్పందించారు. ‘యోగులు, సన్యాసుల్ని కలిసినప్పుడు గౌరవ సూచకంగా వారి పాదాలను
తాకి, ఆశీర్వాదం తీసుకోవడం నాకు అలవాటు. వయసులో చిన్నవారైనా సరే యోగి
ఆదిత్యనాథ్ విషయంలోనూ అలాగే చేశాను. అంటూ వివరణ ఇచ్చారు. ఆగస్టు 10న విడుదలైన
‘జైలర్’ వసూళ్లలో పలు రికార్డులు తిరగరాస్తోంది. ఈ చిత్రాన్ని నెల్సన్ దిలీప్
కుమార్ తెరకెక్కించగా, మోహన్ లాల్, రమ్యకృష్ణ, శివరాజ్ కుమార్, సునీల్ కీలక
పాత్రల్లో నటించారు.