అగ్ర కథానాయకుడు చిరంజీవి నటించనున్న కొత్త సినిమాల సంగతులు బయటికొచ్చాయి.
మంగళవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా రెండు నిర్మాణ సంస్థలు సినిమాలని
అధికారికంగా ప్రకటించాయి. ఒకటి చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల సంస్థ గోల్డ్
బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ చిత్రంకాగా, మరొకటి యు.వి.క్రియేషన్స్ సంస్థ
నిర్మిస్తున్న చిత్రం. చిరంజీవి 156వ సినిమాని సుస్మిత కొణిదెల
నిర్మిస్తున్నారు. త్వరలోనే దర్శకుడి వివరాల్ని ప్రకటించనున్నారు. 157వ చిత్రం
వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కనుంది. ‘బింబిసార’ చిత్రంతో విజయాన్ని అందుకున్న
దర్శకుడీయన. యు.వి. క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్
నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫాంటసీ కథతో రూపొందనుందని సినీ వర్గాలు స్పష్టం
చేశాయి. పంచభూతాల్ని ప్రతిబింబించే ఓ పోస్టర్ ను విడుదల చేశారు. “ప్రేక్షకులకు
సరికొత్త ఊహాతీతమైన అనుభూతిని పంచనున్న చిత్రమిది. చిరంజీవి కెరీర్ లోనే
అత్యధిక వ్యయంతో రూపొందుతుంది. ఈ సినిమాతో మెగా మాస్ యూనివర్స్ ని
సృష్టిస్తున్నామ”ని సినీ వర్గాలు తెలిపాయి.