చేస్తాయి. అయితే చెడు ఆహారపు అలవాట్ల కారణంగా దంతాలపై మరకలు వస్తాయి. దంతాలు
తెల్లగా, మెరిసేలా కనిపించాలంటే కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలు. రోజుకు రెండు
సార్లు బ్రష్ చేయడంతో దంతాలు తెల్లగా మెరుస్తాయి.
1.రోజుకి రెండు సార్లు బ్రష్ చేయడంతో పాటు ఆయిల్ పుల్లింగ్, మౌత్ వాష్ తో
పుక్కిలించడం చేస్తూ ఉండాలి. వీటితో పాటు ఇక్కడ చెప్పిన విధంగా దంతాలను శుభ్రం
చేసుకోవడంతో దంతాలు తెల్లగా మారుతాయి.
అలోవెరా జెల్:
అలోవెరా జెల్లో గ్లిజరిన్, బేకింగ్ సోడా కలిపి దంతాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా
చేయడంతో దంతాలు మిలమిల మెరుస్తాయి. దంతాల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
నారింజ తొక్క:
నారింజ తొక్క దంతాలపై ఉన్న కఠినమైన మరకలను తొలగించడంలో సహాయపడుతుంది. నారింజ
తొక్కను దంతాలపై రుద్దితే మరకలు పోతాయి. తాజా నారింజ తొక్కలను దంతాలపై స్క్రబ్
చేయాలి.
వైట్ వెనిగర్:
వైట్ వెనిగర్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి దంతాలపై ఉన్న మరకలను
తొలగిస్తాయి. అలాగే వెనిగర్ లోని ఎసిటిక్ యాసిడ్ దంత ఎనామిల్ ను రక్షిస్తుంది.
జామ ఆకులు:
జామ ఆకులను నమలడంతో దంతాలపై ఉన్న మరకలు సులభంగా తొలగుతాయి. ఇందులోని యాంటీ
మైక్రోబయల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు దంతాలను శుభ్రంగా మార్చుతాయి.
బేకింగ్ సోడా:
బేకింగ్ సోడా దంతాలను శుభ్రంగా మార్చడంలో సహాయపడుతుంది. టూత్ పేస్ట్ లో
బేకింగ్ సోడా, కొద్దిగా ఉప్పు కలిపి దంతాల మీద రుద్దాలి. ఇలా చేయడంతో దంతాలు
మెరుస్తాయి.
ధూమపానం వద్దు:
ముందు చెప్పిన చిట్కాలు ఫాలో అవుతూ ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటంతో
దంతాలపై మరకలు ఏర్పడవు.