వచ్చే సంక్రాంతికి బాక్సాఫీసు దగ్గర హంగామా ఎక్కువగానే కనిపించనుంది. ‘కల్కి’,
‘గుంటూరు కారం’ చిత్రాలు ఇప్పటికే సంక్రాంతి పోటీకి సిద్ధమయ్యాయి. చిరంజీవి,
కల్యాణ్ కృష్ణ కాంబోలో రూపొందుతున్న సినిమానీ సంక్రాంతికి రిలీజ్
చేయాలనుకొంటున్నారు. హనుమాన్ కూడా పోటీకి ‘సై’ అంటోంది. ఇప్పుడు నాగార్జున
కూడా ఈ రేసులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మలయాళంలో హిట్టయిన ఓ
చిత్రాన్ని తెలుగులో నాగార్జున ‘గలాటా’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. విజయ్
బిన్నీ దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్ నీ కథానాయికగా ఎంచుకొన్నారని టాక్. ఈ
చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని ఫిక్సయ్యారట. ఈనెల 29న నాగార్జున
పుట్టిన రోజు. ఈ సందర్భంగా నాగ్ కొత్త సినిమాకి సంబంధించిన అప్ డేట్ బయటకు
వచ్చే అవకాశం ఉంది.