లైంగికాసక్తి తగ్గుతుంది. మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ దశలో మహిళలు
మానసిక ఒత్తిడికి గురవుతారు. అయితే ఈ మెనోపాజ్ సమయంలో కొన్ని ఆహారాలు తినడం
వల్ల సమస్యలు మరింత ఎక్కువవుతాయి. అవేంటో చూద్దాం..
ఆల్కహాల్
మెనోపాజ్ సమయంలో బాడీలో హార్మోన్ అసతుల్యత పెరిగిపోతుంది. ఆల్కహాల్ తాగడం వల్ల
ఇది రెట్టింపవుతుంది. ఇది బాడీలో మంట, బరువు పెరగడానికి కారణమవుతుంది.
కెఫిన్:
మెనోపాజ్ సమయంలో కెఫిన్ పదార్థాలు అస్సలు తీసుకోవద్దు. కాఫీ, టీలాంటివి తాగడం
వల్ల నిద్రలేమి, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు పెరిగిపోతాయి.
చక్కెర:
చక్కెర అతిగా తీసుకోవడం వల్ల ఇంఫ్లమేషన్ పెరిగిపోతుంది. బరువు కూడా
పెరుగుతారు. అందువల్ల మెనోపాజ్ సమయంలో చక్కెర పదార్థాలు తీసుకోవద్దు.
సోయా:
సోయా, దీని ఉత్పత్తులు తినడం వల్ల ఈస్ట్రోజెన్ లెవెల్స్ అసమతుల్యత
ఏర్పడుతుంది. అందువల్ల మెనోపాజ్ దశలో ఇవి కూడా తినడం మంచిది కాదు.
రెడ్ మీట్:
బరువు పెరగడం, అలసట వంటి సమస్యలకు రెడ్ మీట్ తినడం ఓ కారణం. మెనోపాజ్ తొందరగా
రావడానికి కూడా ఇవే కారణం.
పాల ఉత్పత్తులు:
పాలు, చీజ్ వంటివి ఉదరంలో మంట, గ్యాస్ ఉబ్బరం వంటి సమస్యలకు కారణమవుతాయి.
అలాగే మెనోపాజ్ దశలో వీటిని తినడం ద్వారా కంఫర్ట్ గా ఉండలేరు.
మసాలా ఫుడ్:
స్నాక్స్, స్ట్రీట్ ఫుడ్ లాంటి మసాలా పదార్థాలు తీసుకోవడం వల్ల మెనోపాజ్ దశలో
హాట్ ఫ్లాష్ సంకేతాలు ఏర్పడతాయి. ఇవి మిమ్మల్ని మరింత ఇబ్బందిపెడతాయి.
ప్రాసెస్డ్ ఫుడ్:
ప్రాసెస్డ్, జంక్ ఫుడ్ తినడం వల్ల మెనోపాజ్ దశలో మెటబాలిజం రేటు తగ్గిపోతుంది.
అలాగే హార్మోన్ అసమతుల్యత కూడా పెరిగిపోతుంది.