శరీరం సహకరిస్తుంది. లేదంటే కాస్త దూరం నడవాలన్నా, పని చేయాలన్నా
ఇబ్బందిపడతారు. ఎముకలను పుష్టిగా మార్చే ఆహార పదార్థాలేమిటో తెలుసుకుందాము..
వాల్ నట్స్:
ఇందులో క్యాల్షియం ఉంటుంది. పాలతో కలిపి తింటే మేలు జరుగుతుంది.
సాల్మన్ చేపలు:
వీటిని తినడం వల్ల కూడా ఎముకలు దృఢంగా ఉంటాయి.
గుడ్లు:
కోడిగుడ్లలో ప్రొటీన్లు, పోషకాల నిల్వ ఉంటుంది. కనుక వీటిని తీసుకోవడం వల్ల
ఎముకలు బలంగా మారుతాయి.
బచ్చలికూర:
బచ్చలికూరలో ఐరన్, కాల్షియంతో పాటు విటమిన్ కె కూడా ఉంటుంది.
ఎర్ర ముల్లంగి:
ఎర్ర ముల్లంగిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి
కూడా ఉంటాయి. కావున ఇవి ఎముకలు దృఢంగా మారేందుకు తోడ్పడతాయి.
అరటిపండు:
అరటిపండులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది.
పనీర్:
పనీర్ కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను పుష్టిగా మార్చుతాయి.
పాలు:
పాలలో కాల్షియం అత్యధికంగా ఉంటుంది. కాల్షియం ఎముకలు బలంగా మారేందుకు
దోహదపడుతుంది.