మారుతుంది. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలంటే ఈ పండ్లు తింటే చాలు.
అవకాడో:
అవకాడో చర్మాన్ని హైడ్రేట్ గా మార్చడంలో సహాయపడుతుంది. అవకాడోలో విటమిన్ సీ, ఈ
కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అవకాడో తినడంతో ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది.
కణాలు ఆరోగ్యంగా మారేలా చేస్తుంది. చర్మం నిత్యం హైడ్రేట్ గా ఉంటుంది.
ఆరటి:
ఆరటిలో విటమిన్ ఏ, బీ, సీ, డీ, ఫోలేట్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, జింక్
కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇవి చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. పొడి చర్మంతో
బాధపడుతున్నవారు అరటి తినడం ఉత్తమం.
దానిమ్మ:
పొడి చర్మం సమస్యతో బాధపడుతున్న వారు దానిమ్మ తినడం ఉత్తమం. దానిమ్మలో యాంటీ
మైక్రోబయల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇందులో ఉన్న
మినరల్స్ చర్మాన్ని అందంగా, హైడ్రేట్ మార్చుతాయి.
కీరదోస:
కీరదోసలో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇందులో ఉన్న విటమిన్లు ఏ,విటమిన్ సి,
విటమిన్ కె చర్మాన్ని అందంగా మార్చుతాయి. వీటిని రెగ్యులర్ గా తినడంతో చర్మం
సహజంగా మాయిశ్చరైజ్ అవుతుంది.
బెర్రీస్:
బెర్రీస్ తినడంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. బెర్రీస్ లో నీటి శాతం అధికంగా
ఉంటుంది. ఇందులో ఉన్న విటమిన్ ఏ, సీ, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని హైడ్రేట్
గా చేస్తాయి. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది.
గ్రేప్ ఫ్రూట్:
గ్రేప్ ఫ్రూట్ లో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇందులో ఉన్న లైకోపీన్
చర్మాన్ని మృదువుగా, ఆకర్షణీయంగా మార్చుతుంది. ఈ పండు తినడంతో చర్మం హైడ్రేట్
గా మారుతుంది.
నారింజ:
నారింజ తినడంతో చర్మం హైడ్రేట్ గా మారుతుంది. నారింజ తినడంతో చర్మం ఆరోగ్యంగా
మారుతుంది. సూర్యకిరణాల నుంచి రక్షణ లభిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు,
విటమిన్లు పొడి చర్మం సమస్యను దూరం చేస్తాయి.
నిమ్మకాయ:
నిమ్మకాయలో విటమిన్ ఏ, సీ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉన్న మినరల్స్
చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి. నిమ్మరసాన్ని రెగ్యులర్ గా తీసుకోవడంతో చర్మంపై
ఉన్న మృతకణాలు తొలగుతాయి.