విశాఖపట్నం : వైసీపీ పాలనతో పోల్చితే తనకు టీడీపీ పాలనే నచ్చిందని జనసేన
పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేర్కొనడంపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ
స్పందించారు. ఓ సెలెబ్రిటీ రాష్ట్రమంతా తిరుగుతూ మా సీఎంపై అసహనం
ప్రదర్శిస్తున్నారు అంటూ పవన్ పై పరోక్ష విమర్శలు చేశారు. ఆ సెలెబ్రిటీకి
టీడీపీ పాలన నచ్చిందట..పచ్చకామెర్ల వాళ్లకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నది
మరోసారి నిరూపితమైంది అని ఎద్దేవా చేశారు. “టీడీపీ హయాంలో దోపిడీ, పెత్తందారీ
వ్యవస్థ ఆ సెలెబ్రిటీకి కనిపించలేదా? రుషికొండలో జరుగుతోంది ప్రభుత్వ భవనాల
నిర్మాణం… పైగా ఆ నిర్మాణాలు ప్రభుత్వ భూముల్లోనే జరుగుతున్నాయి…
నీకెందుకు నొప్పి? అందుకే ప్రజలు నిన్ను ఆమోదించడంలేదు” అని బొత్స
వ్యాఖ్యానించారు. వైసీపీ సర్కారును గద్దె దించాలని సెలెబ్రిటీ అంటున్నారని,
ఎందుకు గద్దె దించాలని అంటున్నారో, దాని వెనుక ఉన్న ప్రణాళికలు ఏంటో కూడా ఆ
సెలెబ్రిటీ చెబితే బాగుంటుందని బొత్స అన్నారు. ఉగాది తర్వాత సెలెబ్రిటీ
పరిస్థితి ముగుస్తుందని, ఈ ఆర్నెల్లు వినిపించే అరుపులు, కేకలు ఆ తర్వాత
ఉండవని వ్యంగ్యం ప్రదర్శించారు.