ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము..
1.యాంటీ ఆక్సిడెంట్స్:
మఖానా గింజల్లో యాంటీ ఆక్సిడెంట్స్ లా పనిచేసే పాలీఫెనాల్, ఫ్లేవనాయిడ్స్
అధికంగా ఉంటాయి. ఇవి మన బాడీలో ఫ్రీ రాడికల్ ఎలిమెంట్స్, వాటి ప్రభావాలను
తొలగించడంతోపాటు ప్యాంక్రియాస్ దాని పనులను పెంచడంలో కూడా సాయపడుతుంది.
ఇన్సులిన్ ఉత్పత్తికి మేలు చేస్తుంది. దీనివల్ల షుగరు కంట్రోల్ అవుతుంది.
2.మెగ్నీషియం:
వీటిల్లో మెగ్నీషియం ఉంటుంది. శరీర కణజాలాల్లో ఇన్సులిన్ సెన్సిటివిటీని
మెరుగుపరుస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని అభివృద్ధి చేస్తే, అది మన
శరీరానికి సమర్థవంతగా ఉపయోగపడుతుంది. షుగరు ఉన్నవారికి ఇది చాలా మంచిది.
3.ఫైబర్ కంటెంట్:
మఖానా గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. షుగరు లెవల్స్ ను ఇది కంట్రోల్
చేస్తుంది. దీంతోపాటు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను కూడా కంట్రోల్ చేస్తుంది.
వీటిని తినడంవల్ల కడుపు త్వరగా నిండిన ఫీలింగ్ కలుగుతుంది.
4.లో గ్లైసెమిక్ ఇండెక్స్:
మఖానాలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ లెవల్స్ ఉంటాయి. హై షుగర్ ఫుడ్స్
తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు క్రమంగా పెరిగి షుగర్ లెవల్ అదుపులో
ఉంటుంది. వీటిని వేయించి తినొచ్చు.
5.గుండెకి మేలు:
షుగరు పేషెంట్లు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే గుండె సమస్యలు వస్తాయి.
మఖానాలో కొలెస్ట్రాల్ లెవల్స్ తక్కువగా ఉంటాయి. దీనివల్ల షుగరు తగ్గడమే
కాకుండా గుండెకు ఎంతో మేలు కలుగుతుంది. మఖానా గింజలని తీసుకుంటే కొలెస్ట్రాల్
లెవల్స్ తగ్గుతాయి.