ముఖ్యమంత్రి స్టాలిన్ కొనియాడారు. మదురై మునిసాలై జంక్షన్లో ఉన్న
కార్పొరేషన్ తూర్పు మండల కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని
ముఖ్యమంత్రి స్టాలిన్ ఆవిష్కరించారు. ఇందుకు సంబంధించి తన ట్వీట్లో 24
ఏళ్ల వయసులో పాడటం ప్రారంభించి 11 భాషల్లో 10 వేలకుపైగా సినిమా పాటలు, 2,500
భక్తి పాటలు పాడారని తెలిపారు. ఆయన భక్తి పాటలు రాష్ట్రంలోని ఆలయాలు,
వేడుకల్లో నేటికీ ప్రతిధ్వనిస్తున్నాయని పేర్కొన్నారు. టీఎంఎస్ శతజయంతి
సందర్భంగా చెన్నైలో ఆయన నివసించిన ఇల్లు ఉన్న మందైవెళి ఔటర్ సర్కిల్
రోడ్డుకు ఆయన పేరు పెట్టినట్టు గుర్తు చేశారు.
అప్పడాల వ్యాపారికి అభినందనలు : కార్పొరేషన్ పాఠశాలకు రూ.1.81 కోట్ల మేర
ఆర్థిక సాయం చేసిన అప్పడాల వ్యాపారిని ముఖ్యమంత్రి స్టాలిన్ అభినందించారు.
మదురై జిల్లా దత్తనేరికి చెందిన రాజేంద్రన్ ‘తిరుపతి విలాస్’ పేరుతో
అప్పడాలు మొదలైన వాటిని విక్రయిస్తున్నారు. సమాజ సేవపై ఆసక్తి ఉన్న ఆయన మదురై
కార్పొరేషన్ తిరువిక హయ్యర్ సెకండరీ పాఠశాలకు 10 తరగతి గదులు, ప్రార్థనా
మందిరం, వాహనాల పార్కింగ్ ప్రాంతం తదితర వాటిని రూ.1.10 కోట్ల ఖర్చుతో
నిర్మించారు. అదేవిధంగా ఈ ఏడాది మదురై కార్పొరేషన్ కైలాసపురం ప్రాథమిక
పాఠశాలలో నాలుగు తరగతి గదులు, ఆహారం తినే ప్రాంతం, మరుగుదొడ్డి మొదలైన వాటిని
రూ.71.45 లక్షల ఖర్చుతో నిర్మించారు. మదురై మీనాక్షి అమ్మన్ ఆలయం వద్ద ఉన్న
పుదు మండప పునరుద్ధరణకు రూ.2 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సమాజ
సేవ చేస్తున్న రాజేంద్రన్‌ని ముఖ్యమంత్రి స్టాలిన్ తన కార్యాలయానికి
పిలిపించి ఆయన సేవలను అభినందించారు. కరుణానిధి విగ్రహాన్ని అందజేసి
సత్కరించారు.
మురసోలి మారన్‌కు నివాళి : దివంగత డీఎంకే మాజీ ఎంపీ, మంత్రి మురసోలి మారన్
90వ జయంతి సందర్భంగా మదురై జిల్లా తిరుప్పరకుండ్రం సిలైమాన్ ప్రాంతంలోని
అన్నామండ్రంలో ఉన్న ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి స్టాలిన్ నివాళులర్పించారు.
అనంతరం అక్కడున్న మురసోలి మారన్ రీడింగ్ రూమ్‌ని సందర్శించారు. తరువాత ఆ
ప్రాంత ప్రజలతో మాట్లాడారు. కార్యక్రమంలో మంత్రులు పొన్ముడి, రామచంద్రన్,
మూర్తి తదితరులు పాల్గొన్నారు.
తిరుమావళవన్‌కు జన్మదిన శుభాకాంక్షలు : వీసీకే అధ్యక్షుడైన ఎంపీ తిరుమావళవన్
జన్మదినం సందర్భంగా ఆయనకు ముఖ్యమంత్రి స్టాలిన్ శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన సందేశ ప్రకటనలో ఈ నేలపై లోతుగా నాటిన తందై
పెరియార్, అంబేడ్కర్ భావజాలాన్ని తన మాటలు, చర్యలు ద్వారా తిరుమావళవన్
పెంపొందిస్తున్నారని ప్రశంసిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.