లండన్ : తన హిందూ విశ్వాసమే తన జీవితంలోని అన్ని అంశాల్లో మార్గదర్శిగా
ఉందని, బ్రిటన్ ప్రధానిగా అత్యుత్తమంగా పనిచేసే ధైర్యాన్ని ఆ విశ్వాసమే
ఇస్తోందని రిషి సునాక్ తెలిపారు. కేంబ్రిడ్జి వర్సిటీలోని జీసస్ కళాశాలలో
ఆధ్యాత్మిక వేత్త మొరారి బాపు ఆధ్వర్యంలో కొనసాగుతున్న రామ కథ కార్యక్రమంలో
ఆయన పాల్గొని మాట్లాడారు. బాపు.. నేను ప్రధానిగా ఇక్కడికి రాలేదు. ఒక
హిందువుగా వచ్చా. నా దృష్టిలో విశ్వాసం అనేది వ్యక్తిగతం. నా జీవితంలోని ప్రతి
అంశంలోనూ ఆ విశ్వాసం నన్ను నడిపిస్తోంది. బ్రిటన్ ప్రధాని పదవి అనేది గొప్ప
గౌరవం. కానీ అది అంత సులభమైనది కాదు. క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి
ఉంటుంది. ఆ సమయంలో మన విశ్వాసమే మనకు ధైర్యాన్ని, బలాన్ని ఇస్తుంది. నా
కార్యాలయంలో బంగారు వినాయకుడి విగ్రహం ఉంటుంది. ఏ పని చేసేముందైనా వాటి
గురించి తెలుసుకోవాలని, ప్రభావాలను అంచనా వేయాలని ఆ విగ్రహం గుర్తు చేస్తూ
ఉంటుంది. నా బాల్యం నుంచి పెద్దయ్యేవరకూ సౌథాంప్టన్‌లోని స్థానిక మందిరంతో
నాకు ఎన్నో జ్ఞాపకాలున్నాయి. నా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పూజలు
చేసేవారు, హారతులు ఇచ్చేవారు. ఆ సమయంలో నా సోదరులు, సోదరీమణులతో కలిసి
ప్రసాదాలను అందజేసేవాడినని సునాక్ వివరించారు.