వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ శకటానికి ద్వితీయ స్థానం * వైద్య ఆరోగ్య శాఖ
స్పెషల్ సిఎస్ ఎం.టి.కృష్ణ బాబుకు బహుమతిని అందజేసిన సిఎం వైఎస్ జగన్మోహన్
రెడ్డి
అమరావతి : విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మంగళవారం రాష్ట్ర
ప్రభుత్వం ఘనంగా నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించిన
వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు ద్వితీయ బహుమతి లభించింది. ముఖ్యమంత్రి
వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సిఎస్
ఎం.టి.కృష్ణ బాబు బహుమతిని అందుకున్నారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్
జె.నివాస్, ఆరోగ్య శ్రీ సిఇవో ఎం.ఎన్.హరీందర ప్రసాద్ , ఎపివివిపి కమీషనర్
వెంకటేశ్వర్ పాల్గొన్నారు.
ప్రజల ముంగిట వైద్య సేవలు : ప్రభుత్వ రంగంలో వైద్యసేవల్ని విస్తరించి పేదల
ముంగిటకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి
విప్లవాత్మక చర్యల్ని చేపట్టారు. ఫలితంగా వైద్య ఆరోగ్య శాఖ దేశానికే ఆదర్శంగా
నిలిచింది. రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల్ని నెలకొల్పడం ద్వారా పేదలకు
మెరుగైన వైద్య సేవలందించేందుకు చర్యలు తీసుకున్నారు. గత వందేళ్ళ కాలంలో
రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఏర్పడిన వైద్య కళాశాలలు కేవలం 11 మాత్రమే కాగా,
వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత
నాలుగేళ్ళ కాలంలో రు.8,480 కోట్ల వ్యయంతో కొత్తగా 17 వైద్య కళాశాలలు
ఏర్పాటయ్యాయి . అందులో ఈ ఏడాది 5 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రవేశాల
ప్రక్రియను ప్రారంభిమయ్యింది. తద్వారా ప్రతి ప్రభుత్వ వైద్య కళాశాలలో 150
మంది వైద్య విద్యను అభ్యసించేందుకు అవకాశమేర్పడింది. వైద్య ఆరోగ్యశాఖలో ఏ
ఒక్క పోస్టూ ఖాళీగా వుండకూడదన్న లక్ష్యంతో దాదాపు 50 వేలకు పైగా పోస్టులను
భర్తీ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. ఇంత పెద్ద ఎత్తున
పోస్టుల్ని దేశంలో ఏ రాష్ట్రమూ భర్తీ చేసి ఉండదనే చెప్పాలి. పల్లెల్లో వైద్య
సేవలందించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం” ద్వారా పేదలకు
ఆధునిక వైద్య సేవల్ని వారి ముంగిట్లోనే ఉచితంగా అందించడం మరో విప్లవాత్మక
కార్యక్రమం. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వైద్య ఆరోగ్య
శాఖ మంత్రి విడదల రజనీ, స్పెషల్ సిఎస్ ఎం.టి.కృష్ణ బాబు, కమీషనర్ జె.నివాస్ లు
నిరంతరం సమీక్షలు, పర్యవేక్షణ చేస్తూనే వున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి
పిహెచ్ సిలో ఇద్దరు డాక్టర్లు, 104 వాహనం ద్వారా వైద్య సేవల్ని గ్రామాలలో
వున్న డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ లతో అనుసంధానం చేశారు.
పిహెచ్ సిలో ఒక డాక్టర్ వైద్య సేవలందిస్తుంటే మరో డాక్టర్ తమకు కేటాయించిన
గ్రామాన్ని సందర్శించి అక్కడి వైఎస్ఆర్ క్లినిక్ ద్వారా ప్రజలకు వైద్య
సేవల్ని అందిస్తారు. దీంతో పాటు గ్రామంలోని పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని
సందర్శించి అక్కడ కూడా వైద్య సేవలందిస్తారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం
ద్వారా ఇప్పటి వరకూ 1.96 కోట్ల మందికి వైద్య సేవలందాయి. ఇందులో 65.48 లక్షల
మందికి సాధారణ ఓపి సేవలందగా, 5.64 లక్షల మంది గర్భిణులు, 2.68 లక్షల మంది
బాలింతలు, 7.49 లక్షల మంది రక్త పోటు బాధితులు, 4.18 లక్షల మంది మధుమేహ
బాధితులతో పాటు మరో 57,608 మంది రక్తహీనత బాధితులకు వైద్యసేవలందాయి. పల్లె
చెంతకు ఆధునిక వైద్యాన్ని తీసుకెళ్లే ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో వున్న
10,032 డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ లలో ప్రత్యేక శిక్షణ పొందిన
కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల ద్వారా వైద్య సేవలందుతున్నాయి. వీరితో పాటు 24
గంటలూ అందుబాటులో వుండే విధంగా ఎఎన్ఎం, ఆశావర్కర్లను నియమించారు. ఈ క్లినిక్
ల ద్వారా 12రకాల వైద్య సేవలు, 14 రకాల వైద్య పరీక్షలతో పాటు 105 రకాల మందులు
అందుబాటులో వుండే విధంగా వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది.
వీటితో పాటు టెలి మెడిసిన్ కార్యక్రమం ద్వారా స్పెషలిస్ట్ వైద్య సేవల్ని కూడా
అందుబాటులోకి తీసుకొచ్చింది. లైఫ్ సేవింగ్ పద్ధతులపై ఇప్పటికే కమ్యూనిటీ
హెల్త్ ఆఫీసర్లకు ప్రత్యేక శిక్షణనిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా వున్న 542
పట్టణ ఆరోగ్య కేంద్రాల ద్వారా 172 రకాల మందులు, 60 రకాల వైద్య పరీక్షలను
ప్రజలకు అందుబాటులో వుంచింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించిన
శకటాల్లో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు ద్వితీయ బహుమతి లభించడం పట్ల
వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి.కృష్ణ బాబు ముఖ్యమంత్రి వర్యులు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా సిఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి
సమక్షంలో బహుమతిని అందుకోవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.