కమలహాసన్ నటించిన ‘విక్రమ్’ సినిమా క్లైమాక్స్ లో రోలెక్స్ అనే ప్రతినాయక
ఛాయలున్న పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు కథానాయకుడు
సూర్య. ఆ పాత్రపై ఓ సినిమా రాబోతుందని గతంలో చాలా సార్లు వార్తలొచ్చాయి. అయితే
ఇప్పుడీ విషయంపై సూర్య స్వయంగా స్పష్టత ఇచ్చారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఆ
చిత్రానికి సంబంధించిన కథను చెప్పినట్లు వెల్లడించారు. ఆదివారం ఫ్యాన్స్ మీట్
లో పాల్గొన్న సూర్య తన తదుపరి సినిమా విశేషాల్ని పంచుకున్నారు. “ప్రస్తుతం
నేను “కంగువా” షూటింగ్ లో బిజీగా ఉన్నా. అది మేము ఊహించిన దాని కంటే అద్భుతంగా
వస్తోంది. అక్టోబరు నుంచి నా 43వ ప్రాజెక్ట్ ను ప్రారంభించాలనుకుంటున్నాం.
దర్శకుడు వెట్రిమారన్ ‘విడుదలై-2’ చిత్రీకరణలో ఉన్నారు. ఆయన ఆ చిత్రం పూర్తి
చేసిన తర్వాత మా కలయికలో ‘వాడి వసల్’ మొదలవుతుంది. లోకేష్ రోలెక్స్ పాత్రకి
సంబంధించిన కథ చెప్పారు. అది నాకు చాలా నచ్చింది. త్వరలో అది ప్రారంభమవుతుంది.
ఇది పూర్తయ్యాక ‘ఇరుంభుకైమాయావి’ చేస్తాం అని తెలిపారు.