కమల్ హాసన్, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోల చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది
కాజల్. ఈ జాబితాలోనే ఇప్పుడు నాగార్జున చిత్రం కూడా చేరిందని అంటున్నాయి
సినీవర్గాలు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘పొరింజు మారియన్ జోస్’. ఈ చిత్రాన్ని
తెలుగులో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నాగార్జున కథానాయకుడిగా
నటించనున్నారు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం
అవుతున్నారు. కథానాయికగా కాజల్ ను ఎంచుకొంటారని టాక్. ఇది వరకు ఈ సినిమా కోసం
టబు పేరు పరిశీలనకు వచ్చింది. అయితే టబు కంటే కాజల్ బెటర్ ఉంటుందని, నేటివిటీ
సమస్య ఉండదని చిత్రబృందం భావించిందట. పైగా తల్లిగా మారాక కాజల్ కాస్త పద్ధతైన
పాత్రలను ఎంచుకొంటోంది. తన వల్ల ఈ క్యారెక్టర్ డెప్త్ మరింత పెరుగుతుందని
చిత్రబృందం నమ్ముతోంది. కాజల్ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఇన్నేళ్లయినా
నాగార్జునతో కలిసి నటించలేదు. ఆ అవకాశం ఇప్పటికి వచ్చింది. నాగ్ నటించే 99వ
చిత్రం ఇదే. త్వరలోనే ఈ సినిమాకి క్లాప్ కొట్టనున్నారని సమాచారం.