గ్రీన్ టీ తాగడంతో ఆరోగ్యం చెడిపోతుంది. ఎక్కువగా గ్రీన్ టీ తాగడంతో వచ్చే
సమస్యలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం…
1.రక్తహీనత:
గ్రీన్ టీలో ఎపిగాల్లోకాటెచిన్ గాలెట్ అనే వర్ణద్రవ్యం ఉంటుంది. ఇది రక్తంలోని
ఐరన్ పరిమాణాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా హిమోగ్లోబిన్ కౌంట్ తగ్గుతుంది.ఇది
రక్తహీనతకు కారణం అవుతుంది.
2.గ్యాస్ట్రిక్ సమస్య:
ఖాళీ కడుపుతో గ్రీన్ టీని ఎప్పుడూ తాగకూడదు. ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడంతో
ఎసిడిటీ సమస్య వస్తుంది. అనేక జీర్ణ సమస్యలకు ఇది కారణం అవుతుంది.
3.నిద్రలేమి:
గ్రీన్ టీలో 25 మిల్లీ గ్రాముల కెఫైన్ ఉంటుంది. ఎక్కువగా గ్రీన్ టీ తాగడంతో
ఇది శరీరంలో చేరుతుంది. దీంతో నిద్రలేమి, నీరసం వచ్చే అవకాశం ఉంది.
4.నాడీ వ్యవస్థ:
వివిధ మందులతో పాటు గ్రీన్ టీ తాగడంతో నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. గ్రీన్ టీ
ఎక్కువగా తాగడంతో రక్తపోటు సైతం వేగంగా పెరుగుతుంది.
5.గర్భధారణ సమయంలో:
గర్భధారణ సమయంలో ఎక్కువగా గ్రీన్ టీ తాగడంతో పిండం అభివృద్ధిపై చెడు ప్రభావం
పడుతుంది. గ్రీన్ టీ అధికంగా తాగడంతో తల్లీ బిడ్డ ఆరోగ్యం చెడిపోతుంది.
రక్తపోటు పెరుగుతుంది.
6.కాలేయ ఆరోగ్యం:
ఎక్కువగా గ్రీన్ టీ తాగడంతో శరీరంలో కెఫిన్ కంటెంట్ పెరుగుతుంది. దీన్ని
విచ్చిన్నం చేయడానికి కాలేయం అనేక ఎంజైమ్సున్న విడుదల చేస్తుంది. దీంతో
కాలేయంపై భారం పడి ఆరోగ్యం చెడిపోతుంది.
7.థైరాయిడ్ గ్రంథి:
గ్రీన్ ఎక్కువగా తాగితే కెఫిన్ కంటెంట్ పెరుగుతుంది. ఇది థైరాయిడ్ గ్రంథి
పనితీరును దెబ్బతీస్తుంది. ఇది థైరాయిడ్ హార్మోన్ల శోషణను అడ్డుకుంటుంది.
ఫలితంగా హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడుతుంది. దీంతో అనేక వ్యాధులు వస్తాయి.
8.ఎముకలు బలహీనం:
గ్రీన్ టీలోని ప్లేవనాయిడ్స్ ఎముకలను దృఢంగా మార్చుతాయి. అయినప్పటికీ మోతాదుకు
మించి గ్రీన్ టీ తాగడంతో ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుంది. గ్రీన్ టీలోని కెఫిన్
కాల్షియం శోషణకు ఇబ్బంది కలిగిస్తుంది.