వినియోగించడంతో వాటి రుచి పెరుగుతుంది. వంటకాల ఫ్లేవర్ కూడా పెరుగుతుంది.
ఆరిగానోతో కలిగి ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
విటమిన్లు:
ఆరిగానో ఆకుల్లో విటమిన్ కె, విటమిన్ ఈ లభిస్తుంది. వీటితో పాటు ఇందులో ఫైబర్,
మాంగనీస్, ఐరన్, ట్రైప్టోఫాన్, కాల్షియం కూడా లభిస్తుంది. ఇవి ఆరోగ్యాన్ని
రెట్టింపు చేస్తాయి.
యాంటీ ఆక్సిడెంట్లు:
ఆరిగానో ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటిని ఆహారంలో భాగం
చేసుకోవడంతో కణాలు ఆరోగ్యంగా మారుతాయి. ఫ్రీ రాడికల్స్ నుంచి ఉపశమనం
లభిస్తుంది.
ఇన్ఫెక్షన్లు దూరం:
ఆరిగానో ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి వివిధ రకాల
ఇన్ఫెక్షన్లను దూరం చేయడంలో సహాయపడతాయి.
దగ్గు నుంచి ఉపశమనం:
ఆరిగానో ఆకులను ఆహారంలో భాగం చేసుకోవడంతో వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా
ఉండవచ్చు. ముఖ్యంగా జలుబు, దగ్గు నుంచి ఉపశమనం అందించడంలో ఇవి సహాయపడతాయి.
యాంటీ క్యాన్సర్ ఏజెంట్:
ఆరిగానో ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను
తగ్గిస్తాయి. క్యాన్సర్ కారక కణాలను నిర్మూలించడంలో ఇవి సహాయపడతాయి. వీటిని
ఆహారంలో భాగం చేసుకోవడంతో వివిధ రకాల క్యాన్సర్ల నుంచి దూరంగా ఉండవచ్చు.
ఇన్ఫ్లమేషన్:
ఆరిగానో ఆకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి వాపు
నియంత్రించడంలో సహాయపడతాయి. ఆరిగానో ఆకులను తీసుకోవడం లేదా ఈ నూనెను
రాసుకోవడంతో మంచి ఫలితాలు పొందవచ్చు.
జీర్ణ సమస్యలు దూరం:
ఆరిగానో ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. వీటిని
రెగ్యులర్ గా తీసుకోవడంతో వికారం తగ్గుతుంది. ఆరిగానో ఆకులను రసం చేసుకొని
తాగడంతో మంచి ఫలితాలు పొందవచ్చు.
వేడిని తగ్గిస్తుంది:
ఆరిగానో ఆకుల్లో బాడీలో వేడిని తగ్గించే గుణాలు అధికంగా ఉంటాయి. శరీరంలో వేడి
పెరిగేకొద్దీ గుండె సమస్యలు, డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. వీటిని
కూరల్లో వినియోగించడంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.