నరాలను ఆరోగ్యంగా మార్చుకోవడానికి, నరాల బలహీనత సమస్యను దూరం చేసుకునేందుకు
వీటిని తింటే చాలు.
ఆకుకూరలు
ఆకుకూరల్లో విటమిన్ బీ, ఈ, సీ, మెగ్నీషియం కంటెంట్ అధికంగా ఉంటుంది. హృదయ
స్పందన, శ్వాసక్రియ, జీర్ణక్రియను నియంత్రించే హార్మోన్లను రిలీజ్ చేయడంలో
మెదడుకు ఇవి సహాయపడతాయి. వీటిని తినడంతో నరాల బలహీనత ఉండదు.
చేపలు
చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి నాడీ వ్యవస్థను
ఆరోగ్యంగా మార్చుతాయి. చేపలను తినడంతో మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది.
బ్రోకలీ:
బ్రోకలీ లో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఇది కేంద్రనాడీ వ్యవస్థ పనితీరును
మెరుగుపరుస్తుంది. బ్రోకలి తినడంతో జ్ఞాపకశక్తి రెట్టింపు అవుతుంది.
అల్జీమర్స్ దరిచేరదు.
డార్క్ చాక్లెట్:
డార్క్ చాక్లెట్లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా
ఉంటాయి. ఇందులో ఉన్న ఫాలీఫినాల్స్ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. వీటిని
తినడంతో నరాల బలహీనత ఉండదు.
గుడ్లు:
గుడ్లు తినడంతో జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. ఇందులో కొలిన్, విటమిన్ బీ
పుష్కలంగా ఉంటుంది. ఇవి నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా మార్చుతాయి. గుడ్లు తినడంతో
నరాల బలహీనత దూరం అవుతుంది.
అవకాడో:
అవకాడో తినడంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో విటమిన్ కే, ఫోలేట్ పుష్కలంగా
ఉంటుంది. వీటిని తినడంతో నరాల బలహీనత దూరం అవుతుంది.
బాదం:
బాదంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడును ఆరోగ్యంగా
మార్చడంలో సహాయపడతాయి. నరాల బలహీనత దూరం అవుతుంది.
గుమ్మడి విత్తనాలు:
గుమ్మడి విత్తనాల్లో మెగ్నీషియం, రాగి, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. గుమ్మడిలో ఉన్న
యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తాయి. దీంతో మెదడు ఆరోగ్యంగా
మారుతుంది.