ఇప్పుడు చూద్దాం..
ఆకుకూరలు:
ఆకుకూరల్లో విటమిన్లు, పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిని తినడంతో తక్షణ శక్తి
లభిస్తుంది. రెగ్యులర్ వీటిని తినడంతో సత్తువ పెరుగుతుంది.
నట్స్:
బాదం, జీడిపప్పు వంటి నట్స్ లో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి శక్తిని రెట్టింపు
చేయడంలో సహాయపడతాయి. ఎక్కువ సేపు శక్తిని నిలుపుకోవడంలో కూడా సహకరిస్తాయి.
బీన్స్:
బీన్స్ రెగ్యులర్ గా తినడంతో శక్తి స్థాయిలు రెట్టింపు అవుతాయి. ఈ బీన్స్
తినడానికి ఎంతో రుచికరంగా ఉంటాయి. వీటిలో ఉన్న పోషకాలు ఆరోగ్యాన్ని రెట్టింపు
చేస్తాయి.
డార్క్ చాక్లెట్:
డార్క్ చాక్లెట్ తినడానికి ఎంతో రుచికరంగా ఉంటుంది. చాక్లెట్ తినడంతో తక్షణ
శక్తి లభిస్తుంది. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో
సహాయపడతాయి. మానసిక ప్రశాంతతను అందిస్తాయి.
సీజనల్ పండ్లు:
సీజనల్ పండ్లు, కూరగాయలు తినడంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆయా సీజన్లలో లభించే
పండ్లను తినడంతో శక్తి స్థాయిలు పెరుగుతాయి.
క్వినోవా:
క్వినోవా తినడంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. క్వినోవాలోని న్యూట్రియంట్స్
శరీరానికి కావాల్సిన శక్తిని సులువుగా అందిస్తాయి. వైట్ రైస్ కు బదులుగా
దీనిని తినడం మంచిది.
అరటి:
తక్షణ శక్తిని అందించడంలో, శక్తిని రెట్టింపు చేయడంలో అరటి సహాయపడుతుంది.
అరటిలో విటమిన్ బీ, పొటాషియం కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇవి గుండెను ఆరోగ్యంగా
ఉంచుతాయి.
కాఫీ:
మెదడును రీఫ్రెష్ చేయడంలో, తక్షణ శక్తిని అందించడంలో కాఫీ సహాయపడుతుంది. కాఫీ
తాగడంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. చురుకుగా ఉండవచ్చు.