కొన్నిరోజుల నుంచి ప్రతిదాడులను ఉద్ధృతం చేసిన ఉక్రెయిన్ తాజాగా రష్యాకు
చెందిన ఓడరేవుపై దాడికి దిగింది. నల్ల సముద్రంలోని రష్యాకు చెందిన పోర్టుపై
సముద్ర డ్రోన్‌తో విరుచుకుపడింది. ఈ దాడిలో రష్యా నౌకాదళానికి చెందిన
ల్యాండింగ్ షిప్ ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో రష్యాకు కీలకంగా ఉన్న ఈ ఓడరేవులో
తాత్కాలికంగా కార్యకలాపాలను నిలిపివేశారు. కొన్నిరోజుల నుంచి రష్యాపై
డ్రోన్లతో విరుచుకుపడుతున్న ఉక్రెయిన్ దాడులను మరింత ఉద్ధృతం చేసింది. రష్యా
ఎగుమతులకు అత్యంత కీలకమైన ఓ ఓడరేవుపై ఉక్రెయిన్ బలగాలు డ్రోన్‌తో దాడి
చేశాయి. నల్లసముద్రంలో రష్యాకు చెందిన ఓడరేవుపై ఓ సముద్ర డ్రోన్ దాడి
చేసింది. ఉక్రెయిన్‌కు చెందిన కిల్లర్ డ్రోన్ దాడిలో మాస్కో నౌకాదళానికి
చెందిన ల్యాండింగ్ షిప్ తీవ్రంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో రష్యాకు కీలకంగా
ఉన్న ఈ ఓడరేవులో తాత్కాలికంగా కార్యకలాపాలను నిలిపివేసినట్లు తెలుస్తోంది.
తొలిసారి రష్యా వాణిజ్య ఓడరేవుపై ఉక్రెయిన్ దాడి చేసింది. నౌకాదళంతో కలిసి
సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీసెస్
వెల్లడించింది. ఈ కిల్లర్ సముద్ర డ్రోన్‌లో 450కిలోల టీఎన్టీని అమర్చి
దాడిచేసినట్లు తెలిపాయి. దాడి సమయంలో రష్యా యుద్ధనౌకలో వందమంది వరకు సిబ్బంది
ఉన్నట్లు అంచనా. ఈ దాడితో రష్యా యుద్ధనౌక తీవ్రంగా దెబ్బతినటంతోపాటు
పనిచేయలేని స్థితికి చేరిందని ఉక్రెయిన్ సైనికవర్గాలు వెల్లడించాయి. రష్యాలో
సెయింట్ పీటర్స్బర్గ్ నౌకాశ్రయం తర్వాత ఇది రెండో అతిపెద్ద వాణిజ్య ఓడరేవు.
ఈ నౌకాశ్రయంపై జరిగే దాడులను ఎదుర్కొనేందుకు రష్యా.. రెండు యుద్ధ నౌకలను
మోహరించింది. ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చడమే లక్ష్యంగా మోహరించిన ఈ నౌకలపై
రెండు శతఘ్నులు కూడా ఉన్నాయి. శుక్రవారం తెల్లవారుజామున రెండు మానవరహిత
డ్రోన్లు నోవోరోసిస్క్ ఓడరేవుపై దాడులు చేశాయని రష్యా ధ్రువీకరించింది. ఈ
దాడులను తిప్పికొట్టినట్లు వెల్లడించింది. అయితే ఉక్రెయిన్ దాడి వల్ల ఎలాంటి
నష్టం వాటిల్లలేదని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొనటం ప్రాధాన్యం
సంతరించుకుంది. జూన్‌లో ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం తీవ్రవాద చర్యకు పూనుకుంది.
దక్షిణ ఉక్రెయిన్‌లోని సుమారు 67 ఏళ్లనాటి ఆనకట్టను రష్యా ధ్వంసం చేసిందని
ఉక్రెయిన్ పేర్కొంది. కాగా ఇప్పటికే దెబ్బతిన్న కారణంగానే డ్యామ్ తెగిపోయిందని
రష్యా ఉక్రెయిన్ చేస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టింది.