చూద్దాం..
ఎముకల బలం:
పుట్టగొడుగుల్లో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో కాల్షియం శోషణకు
సహాయపడుతుంది. తద్వారా ఎముకల బలం పెరుగుతుంది.
జ్ఞాపకశక్తి
నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ రీసెర్చ్ ప్రకారం వారానికి రెండు కప్పుల
మష్రూమ్ తినడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. మతిమరుపు సమస్య తగ్గుతుంది.
గుండె ఆరోగ్యం:
పుట్టగొడుగుల్లో గ్లుటమేట్ రైబోన్యూక్లియోటైడ్స్ ఉంటాయి. ఇవి రక్తపోటుని
నియంత్రణలో ఉంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాగే కొలెస్ట్రాల్ కూడా
తగ్గుతుంది.
క్యాన్సర్ నివారణ:
ప్రతిరోజూ 18గ్రాముల ఉడికించిన పుట్టగొడుగులు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే
అవకాశం 45 శాతం వరకు తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిలోని
ఎర్గోథియోనైన్ అనే అమైనో యాసిడ్ వల్ల క్యాన్సర్ కణాల పెరుగుదల నియంత్రణలో
ఉంటుంది.
రక్తపోటు:
పుట్టగొడుగుల్లో సహజమైన సోడియం తక్కువ స్థాయిలో ఉంటుంది. ఓ కప్పు వైట్ బాటమ్
మష్రూమ్స్ లో 5 మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది. అందువల్ల దీనిలో కృత్తిమంగా
ఉప్పు అవసరం చాలా తక్కువ. దీంతో రక్తపోటును కూడా అదుపులో పెట్టుకోవచ్చు.
కొలెస్ట్రాల్:
మీకు ఆరోగ్యకరమైన కేలరీలు, కొవ్వులు, కొలెస్ట్రాల్ కావాలంటే పుట్టగొడుగులు
మంచి ఆప్షన్. ఇవి మీ బాడీలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడతాయి.
రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తాయి.
జీర్ణశక్తి:
పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంపొందించడంలో పుట్టగొడుగులు సహాయపడతాయి.
తద్వారా తిన్న ఆహారం జీర్ణమయ్యేలా చూస్తాయి. జీర్ణ సంబంధ సమస్యల్ని
తగ్గిస్తాయి.
రోగనిరోధక శక్తి:
పుట్టగొడుగుల్లో ఆవశ్యక పోషకాలైన సెలీనియం, విటమిన్ డి, బి6 ఎక్కువగా ఉంటాయి.
ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. తద్వారా అనేక అనారోగ్య సమస్యలను దూరం
చేస్తాయి.
అల్జీమర్స్:
వయసు పెరుగుతున్నా కొద్దీ జ్ఞాపకశక్తి తగ్గిపోయి అల్జీమర్స్ వంటి సమస్యలు
వస్తాయి. అయితే రెగ్యులర్ గా పుట్టగొడుగులను మీ డైట్ లో భాగం చేసుకోవడం వల్ల ఈ
అల్జీమర్స్ సమస్య తగ్గుతుంది.