విశాఖపట్నం : రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల పెండింగ్ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయముతో ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకులు, రాజ్యసభ సభ్యులు వి.విజయ సాయిరెడ్డి హామీ ఇచ్చారు. గురువారం మద్దిలపాలెం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విజయ సాయి రెడ్డితో పాటు ఆ పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై.వి సుబ్బారెడ్డిలను వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శీను బాబు మర్యాద పూర్వకంగా కలుసుకొని సత్కరించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు సంబంధించిన ఇళ్ల స్థలాలతో పాటు పలు అంశాలను వీరి వద్ద ప్రస్తావించారు. ప్రభుత్వం ఆయా సమస్యలు పరిష్కారానికి అవసరమైన మేరకు చర్యలు చేపడుతుందన్నారు. వీరికి శ్రీను బాబు ధన్యవాదాలు తెలిపారు.