* ఈనెల 25న అనారోగ్యంతో హైదరాబాద్ లోని
ఏ ఐ జి ఆస్పత్రిలో చేరిన చల్లా భగీరధ్ రెడ్డి.
* వెండి లెటర్ పై చికిత్స అందించిన వైద్యులు తెల్లవారుజాము నుండి విషమించిన ఆరోగ్య పరిస్థితి.
* తండ్రి చల్లా రామకృష్ణారెడ్డి మృతి తో ఎమ్మెల్సీగా భగీరధ్ ను ఎంపిక చేసిన సియం జగన్.
* శోక సంద్రంలో మునిగిపోయి చల్లా కుటుంబ సభ్యులు అభిమానులు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో గురువారం జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయ చరిత్ర విషాద ఛాయలు.
* గురువారం తెల్లవారుజామున అవుకు చేరుకోనున్న భగీరథరెడ్డి పార్థివ దేహం.
* గురువారం సాయంకాలం చల్లా ఫామ్ హౌస్ లో భగీరధ్ రెడ్డి భౌతికకాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.
వాయిస్ : ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందిన దివంగత ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి, కుటుంబం లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
దివంగత ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి ద్వితీయ కుమారుడు ఎమ్మెల్సీ చల్లా భగీరధ్ రెడ్డి, న్యుమోనియా వ్యాధికి గురై హైదరాబాద్ లో
ఏ ఐ సి ఆసుపత్రి లో చికిత్స పొందుతూ కోలుకోలేక బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు మృతి చెందారు.
దివంగత ఎమ్మెల్సీ చల్లా. భగీరథరెడ్డి మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులు, చల్లా అభిమానులు, నియోజకవర్గ వైసిపి నాయకులు శోక సంద్రంలో మునిగిపోయారు, అవుకు లోని ప్రతి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఎమ్మెల్సీ చల్లా భగీరధ్ రెడ్డి భార్య శ్రీలక్ష్మి అవుకు మండల పరిషత్ జడ్పీటిసి సభ్యులు కాగా 12 ఏండ్ల వయసున్న రాజ్యాభిషేక్ రెడ్డి , 10 ఏండ్ల వయసున్న జూనియర్ చల్లా రామకృష్ణా రెడ్డి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
నిమోనియా వ్యాధితో తీవ్ర అనారోగ్యానికి గురైన చల్లా భగీరథ రెడ్డి , ఈనెల 25 న హైదరాబాద్ , గచ్చిబౌలిలోని ఏ ఐ సి ఆసుపత్రి లో చికిత్స నిమిత్తం చేరారు. మంగళవారం తెల్లవారుజాము నుండి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ పై ఉంచి వైద్యులు చికిత్స అందజేశారు చివరికి కోలుకోలేక బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు మృతి చెందారు.
గురువారం తెల్లవారుజామున దివంగత ఎమ్మెల్సీ చల్లా. భగీరథరెడ్డి పార్థివ దేహన్నీ ప్రత్యేక అంబులెన్స్ వాహనంలో ఆయన స్వస్థలం అవుకు తీసుకొని రానున్నారు.
చల్లా భగీరథ రెడ్డి భౌతికకాయాన్ని జిల్లా వైసిపి నాయకులు ప్రజలు సందర్శన నిమిత్తం చల్లా భవన్ ఉంచనున్నారు. అనంతరం భారీ ఊరేగింపు తో గురువారం సాయంత్రం అవుకు లోని చల్లా ఫామ్ హౌస్ లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అనేకమంది రాజకీయ నాయకుల తో ఎంతో సన్నిత సంబంధాలు కలిగి యంగ్ డైనమిక్ లీడర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న చల్లా.భగీరధ్ రెడ్డి మృతి చెందడం తో జిల్లా వైసిపి నాయకులకు తీరని లోటుగా మారింది
దివంగత నేత ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి, శ్రీదేవి దంపతులకు,ద్వితీయ కుమారుడు గా ఆగష్టు 30 వ తేదీ న 1976 లో అవుకు మండలం ఉప్పల పాడు గ్రామంలో జన్మించారు.
రాజకీయ నేపథ్యం ఉన్న రైతు కుటుంబ లో జన్మించిన చల్లా.భగీరథ రెడ్డి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ లో ఎం ఏ పొలిటికల్ సైన్స్ లో పట్ట బద్రుడై, తండ్రి చల్లా రామకృష్ణారెడ్డి రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చు కున్నాడు. క్రియాశీలక రాజకీయాల్లో తండ్రికి వెన్నంటి ఉండేవాడు.
చిన్ననాటి నుండి రాజకీయాల్లో రాటుతేలిన చల్లా భగీరథరెడ్డి, 2003 నుండి.2009 వరకు, కర్నూలు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా, 2007 నుండి 2008 వరకు ఏడాది పాటు జాతీయస్థాయి యువజన కాంగ్రెస్ సెక్రటరీగా 2009 నుండి 2010 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, వివిధ పదవులు నిర్వహించారు.
రాష్ట్ర విభజన అనంతరం తండ్రి చల్లా రామకృష్ణారెడ్డి తో పాటు , టిడిపి అధినేత నారా చంద్రబాబు సమక్షంలో టిడిపి లో చేరారు. 2019 ఎన్నికల ముందు మార్చి 8న వైయస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ తండ్రి చల్లా రామకృష్ణారెడ్డికి ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు. చల్లా భగీరధ్ రెడ్డి తండ్రి చల్లా రామకృష్ణారెడ్డి కరోనా వ్యాధి కి గురై అపోలో ఆసుపత్రి లో చికిత్స పొందుతూ కోలుకోలేక 2021 జనవరి 01న మృతి చెందాడు.
చల్లా.రామకృష్ణారెడ్డి మృతి చెందటంతో ఆయన కుటంబసభ్యులకు పరామర్శించేందుకు అవుకు వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని ,చల్లా భగీరధ్ రెడ్డి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈమేరకు 2001 ఫిబ్రవరి 25 న ఎమ్మెల్సీ అభ్యర్థిగా చల్లా.భగీరథ రెడ్డిని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.
2001 ఏప్రిల్ 01 ఎమ్మెల్సీగా చల్లా.భగీరధ్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసారు. ఎమ్మెల్సీగా కేవలం 19 నెలలు మాత్రం పదవి నిర్వహించిన చల్లా.భగీరధ్ రెడ్డి ఊపిరితిత్తుల వ్యాధి కి గురై హైదరాబాదు గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొలుకోలేక తుది శ్వాస విడిచారు.
దివంగత ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మృతి చెంది కనీసం 2 ఏండ్లు కూడా గడవకముందే చల్లా కుటుంబం లో కీలక నేతగా ఎదిగిన చల్లా.భగీరధ్ రెడ్డి మృతి చెందడం తో చల్లా కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
ఇటీవల గత నెలరోజుల క్రితం చల్లా.భగీరధ్ రెడ్డి అయ్యప్ప మాల ధారణ చేసి, ఆధ్యాత్మికంగా భక్తి భావంతో అనేక పుణ్యక్షేత్రాలను దర్శించుకుని వచ్చారు. గత వారం రోజుల క్రితం అయ్యప్ప మాల విరమణ నిమిత్తం , శబరిమలై వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకొని తిరిగి వచ్చిన ఆయన నిమోనియా వ్యాధి తీవ్రత ఎక్కువ కావడంతో ఈనెల 25న చికిత్స నిమిత్తం హైదరాబాద్ గచ్చిబౌలి లోని ఏఐజి ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందారు.
చల్లా భగీరధ్ రెడ్డి పార్థీవ దేహాన్ని హైదరాబాద్ నుండి గురువారం తెల్లవారుజామున ఆయన స్వగ్రామం అవుకు తీసుకొని రానన్నారు. గురువారం సాయంత్రం చల్ల ఫామ్ హౌస్ లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చల్లా.భగీరధ్ రెడ్డి మృతి తో చల్లా అభిమానులు వైసిపి శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయారు.