నిర్వహించాలన్న PCB ప్రతిపాదనను సభ్య దేశాలు తిరస్కరించడంతో ఆసియా కప్‌ను
శ్రీలంక లో నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) సోమవారం
నిర్ణయించింది. సెప్టెంబరు నెలలో UAEలో అత్యంత తేమతో కూడిన పరిస్థితులు
ఉంటాయని ఆటగాళ్లకు గాయాలయ్యే అవకాశం ఉన్నందున వేదిక మార్పు అనివార్యమైంది.
ఆరు దేశాల టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి శ్రీలంక ఫ్రంట్
రన్నర్‌గా నిలిచింది. ACC నిర్ణయం తర్వాత పాకిస్థాన్ సెప్టెంబర్ 2-17 వరకు
జరగనున్న టోర్నీలో పోటీపడుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల కారణంగా పొరుగు దేశానికి భారత జట్టును
పంపేందుకు బీసీసీఐ నిరాకరించడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)
ప్రత్యామ్నాయాన్ని ప్రతిపాదించాల్సి వచ్చింది. మంగళవారం మరో దఫా చర్చలు జరిగే
అవకాశం ఉందని పీసీబీ ఆశాభావం వ్యక్తం చేసింది.
భారత్ తమ మ్యాచ్‌లను యుఎఇలో ఆడాలని పాకిస్తాన్ తమ మ్యాచ్‌లను సొంత గడ్డపై
ఆడే విధంగా చూడాలని PCB ప్రతిపాదనకు చుక్కెదురైంది.
PCB ఛైర్మన్ నజం సేథీ దుబాయ్‌లో ఉంటూ తన వంతు ప్రయత్నం చేస్తున్నట్లు
తెలుస్తోంది. పాకిస్తాన్ కరాచీ లేదా లాహోర్‌లో ఆడాలని మరియు భారతదేశం UAEలో
ఆడాలని ప్రతిపాదన పై BCCI సముఖంగా లేదు.