బీజింగ్: చైనాలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఒక కోవిడ్ సోకిన రోగిని అత్యంత హేయంగా క్రేన్ సాయంతో తీసుకువెళ్లిన సంఘటన గురించి ఉన్నాం. ప్రపంచమంతటా చైనాలో కరోనా విషయమైన వ్యవహరిస్తున్న తీరుని విమర్శిస్తున్నా… ఏ మాత్రం తీరు మార్చుకోకపోగా మరిన్ని ఆంక్షలు విధిలించి ప్రజలను బెంబేలెత్తించేలా చేసింది. అది ప్రస్తుతం ఎంతలా ఉందంటే…చైనీయులు కరోనా కేసులు ఉన్న ప్రాంతాల్లో లాక్డౌన్ విధిస్తారు అని తెలియగానే దూరంగా పరుగులు తీసే స్థాయికి వచ్చేశారు. ఈ మేరకు చైనాలో సెంట్రల్ సిటీ ఆఫ్ జెంగ్జౌలో అతిపెద్ద ఐఫోన్ ఫ్యాక్టరీ ఫాక్స్‌కాన్‌లో కరోనా తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతుంది. దీంతో చైనా కరోనా ప్రభావిత ప్రాంతాల్లో జీరో కోవిడ్ లాక్డౌన్ ఆంక్షలు యథావిధిగా అమలు చేస్తోంది. దీన్ని తప్పించుకునేందుకు పలువురు కార్మికులు ఫ్యాక్టరీ కంచెలు దూకి పారిపోతున్న వీడియోలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి. వాస్తవానికి ప్రపంచంలోని సగం ఐఫోన్లు ఈ ఫాక్స్‌కాన్‌లోనే ఇక్కడే తయారవుతాయి. అంతేగాక ఈ ఫ్యాక్టరీలో దాదాపు 3 లక్షల మంది కార్మికులు విధులు నిర్వర్తిస్తారు. వారంతా ప్రస్తుతం ఈ లాక్డౌన్ గురించి భయపడి కాలినడకన ఇళ్లకు పయనమయ్యారు. పగటి పూట పొలాల మీదుగా రాత్రిళ్లు రోడ్ల మీద ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఈ ఫాక్స్‌కాన్ కంపెనీ యూఎస్ ఆధారిత యాపిల్ కంపెనీకి సరఫరదారు. ఐతే ఈ కాలినడకన ఇళ్లకు వెళ్తున్న కార్మికులకు స్థానికులే ఉచిత ట్రాన్స్పోర్ట్ సాయం అందిస్తున్నారు. ప్రస్తుతం హెనాన్ ప్రావిన్స్ రాజధాని జెంగజౌలో గత అక్టోబర్ 29 వరకు 167 కేసులు నమోదయ్యాయి. కేవలం గత ఏడు రోజుల్లోనే 97 కేసులు పెరిగాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో జీరో కోవిడ్ విధానం పూర్తి స్థాయిలో అమలు చేసింది. చైనా ప్రజలు ప్రభుత్వం ఈ ఏడాదితో ఈ జీరో కోవిడ్ చట్టాన్ని ఉపసంహిరిచంకుంటుందని భావించారు. ఐతే ఇటీవల జరిగిన 20వ కమ్యునిస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటిలో ఆ చట్టాన్ని ఉసంహరించే అవకాశం లేదని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ స్పష్టం చేసి వారి ఆశలపై నీళ్లు జల్లారు.